KAVITHA: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట

KAVITHA: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
బెయిల్‌ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు.... జ్యుడీషియల్ కస్టడీ ఈనెల 23వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. మరోమారు బెయిల్‌ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు... జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 23వరకు పొడిగించింది. ఢిల్లీ మద్యం కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. కోర్టు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లుగా తనకు ఆర్ధిక లబ్ధి చేకూరలేదని తెలిపారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువగా జరిగిందని.. తన వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.


ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగిస్తూ... రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. పది రోజుల ఈడీ కస్టడీ తర్వాత మార్చి 26న ఆమెకు... కోర్టు 14రోజులు రిమాండ్‌ విధించింది. ఈ గడువు ముగియనుండగా కవితను ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మరో రెండు వారాలు రిమాండ్‌ పొడిగించాలని కోరారు. కవిత బయట ఉంటే.. కేసు దర్యాప్తు ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ వాదనతో విబేధించిన కవిత తరపు న్యాయవాది.. ఆమె రిమాండ్‌ను పొడిగించడానికి ఈడీ వద్ద కొత్త కారణాలు ఏమీ లేవన్నారు. 2022 నుంచి.. కేసు దర్యాప్తు సాగుతున్నా ఆమె ప్రభావితం చేసిందేమీ లేదన్నారు. ఒకదశలో కవిత మాట్లాడేందుకు అనుమతించాలని న్యాయవాది కోరగా.... అందుకు జడ్జి నిరాకరించారు. అలా మాట్లాడాలంటే.. ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం.. కవిత రిమాండ్‌ను...... ఈనెల 23వరకు పొడిగించారు. న్యాయమూర్తి అనుమతితో కవిత....తన భర్తతో కాసేపు మాట్లాడారు.

ఢిల్లీ మద్యం కేసులో తన బెయిల్ అభ్యర్థనను పరిశీలించాలని MLC కవిత... మరోసారి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని... దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు.. ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువగా జరిగిందని.. రాజకీయంగా, వ్యక్తిగతంగా ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ నెంబర్‌ను ఛానళ్లలో ప్రసారం చేసి... వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారన్న ఆమె.. దిల్లీ మద్యం కేసులో నాలుగుసార్లు విచారణకు హాజరైనట్టు తెలిపారు. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చానని, మొబైల్ ఫోన్లు అన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశానని తెలిపారు. అయినా ఫోన్లు ధ్వంసం చేశానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారన్న ఆమె... తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని....బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story