Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మార్చి 16న మరోసారి ఈడీ ముందు హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కవిత. ఈడీ కార్యాలయానికి మహిళను పిలవడం చట్టవిరుద్దమని పిటిషన్ లో పేర్కొంది. తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పిన ఈడీ.. అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. CrPC 160 ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని కోరారు.
విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. తప్పక.. మార్చి 16న కవిత ఈడీ ఎదుట తప్పక హాజరవనుంది. మార్చి 11న కవితను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. మరోసారి విచారించడానికి మార్చి 16న హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఢిల్లీకి బయలుదేరడానికి కవిత రెడీ అవుతునుట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com