Delhi Liquor Scam: విచారణకు హాజరు కానీ ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam: విచారణకు హాజరు కానీ ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టులో పిటీషన్‌ పెండింగ్‌లో ఉండటం కారణంగా ఈ రోజు విచారణకు హాజరు కాలేనని కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత గురువారం రెండోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ మేరకు ఈడీ కార్యాలయానికి సమాచారం పంపారు. మరోరోజు విచారణ తేదీని నిర్ణయించాలని కవిత అభ్యర్థన చేశారు. సుప్రీం కోర్టులో పిటీషన్‌ పెండింగ్‌లో ఉండటం కారణంగా ఈ రోజు విచారణకు హాజరు కాలేనని కవిత తన న్యాయవాది సామ భరత్‌ ద్వారా ఈడీ కార్యాలయానికి లేఖ పంపారు. దీనిని ఈడీ అంగీకరిస్తుందా లేదా అనే అంశం కీలకంగా మారింది. అయితే ఎమ్మెల్సీ కవిత సుప్రీంలో ఓక మహిళను ఈడీ కార్యాలయానికి పిలవచ్చా అనే విషయంపై పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 24న విచారిస్తామని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు విచారణకు రాలేనని కవిత పేర్కొన్నారు. ఈ లోగా ఈడీ అడిగిన సమాచారాన్ని కవిత పంపారు. దీంతో కన్‌ఫ్రంటేషన్‌ పద్ధతిలో ప్రశ్నించాలని ఈడీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story