Delhi Liquor Scam: సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ వాయిదా

Delhi Liquor Scam: సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ వాయిదా
PMLA యాక్ట్‌ కింద సమన్లు జారీ చేయవచ్చా.?అన్న అంశంపై ధర్మాసనం ముందు వాదనలు

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశంలో లిఖితపూర్వక వాదనలు అందించాలని కవితను ఈడీ ఆదేశించింది. PMLA యాక్ట్‌ కింద సమన్లు జారీ చేయవచ్చా.?అన్న అంశంపై ధర్మాసనం ముందు వాదనలు నడిచాయి. సమన్లకు అవకాశం లేదంటూ కొన్ని సెక్షన్‌లను కోట్‌ చేశారు కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌. అయితే సమన్లుకు అవకాశం ఉందని వాదించారు ఈడీ తరుపు న్యాయవాదులు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం వివరంగా నోటు అందజేయాలని సూచించింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించే విషయంలో.. గతంలో నళిని దాఖలు చేసిన పిటిషన్‌ను ట్యాగ్‌ చేసింది. నళిని చిదంబరం కేసుతో కలిపి విచారిస్తామంది సుప్రీం ధర్మాసనం.

Tags

Next Story