Delhi Liquor Scam : నన్ను వీడియో కాన్ఫరెన్స్ లో విచారించండి : ఎమ్మెల్సీ కవిత

ఎన్నికలు ఎక్కడ జరుగుతాయో అక్కడికి ప్రధాని మోదీ కంటే ముందుగా ఈడీ చేరుకుంటుందని అన్నారు బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరవడానికి ఢిల్లీకి చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. 2023 డిసెంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముండటంతో కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపైకి కేంద్ర సంస్థలను పంపుతున్నదని కవిత ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి9న విచారించేందుకు పిలిచింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ). మార్చి 16న హాజరుకావడానికి అనుమతిని కోరారు కవిత. కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై కక్షసాధిస్తుందని అన్నారు. వివిధ కేసులలో 16మంది బీఆర్ఎస్ మంత్రులను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. బీజేపీ బ్యాక్ డోర్ ద్వారా తొమ్మిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని అన్నారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నించిందని తాము బయపెడితే బయపడే వ్యక్తులం కాదని తెలిపారు.
మార్చి 11న తన ఇంటికి వచ్చి విచారించాలని ఈడీని కోరినట్లు కవిత తెలిపారు. అయినా తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్చించవచ్చని, ఆన్ లైన్ లో ఎందుకు విచారించకూడదని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తాను మార్చి 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com