Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.!?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..రెండు మూడు రోజుల్లో ఈడీ నోటీసులు ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై వచ్చిన అభియోగాలకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా ఈడీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.. ఇప్పటికే ఈడీకి డాక్యుమెంట్లు, మొబైల్స్‌ను కవిత అందజేశారు.. వాటిలోని డేటా, ఇతర అంశాలపై తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు పోల్చి చూస్తున్నట్లు తెలుస్తోంది.అటు రెండోరోజూ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు కవిత తరపు న్యాయవాది.. కవిత ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి విచారించారు.. మద్యం పాలసీ కేసులో ఇప్పటికే పలుమార్లు బుచ్చిబాబును ప్రశ్నించగా.. కవిత ఫోన్ డేటా సమాచారన్ని కూడా విశ్లేషిస్తోంది. ఇదే సమయంలో బుచ్చిబాబును విచారణకు పిలవడంతో పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com