Delhi Liquor Scam case: ఈడీ ఎదుట హాజరైన గోరంట్ల బుచ్చిబాబు

Delhi Liquor Scam case: ఈడీ ఎదుట హాజరైన గోరంట్ల బుచ్చిబాబు
అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబును కలిపి విచారించిన ఈడీ, అరుణ్ పిళ్లై సీబీఐకి అప్రూవర్‌గా మారే అవకాశాలు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. లిక్కర్‌ వ్యాపారి అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నించింది. లిక్కర్‌ పాలసి రూపకల్పన, హోటల్స్‌లో జరిగిన సమావేశాలు, డ్రాఫ్ట్‌ పాలసీ ముందుగా నిందితులకు రావడం అలాగే వంద కోట్లు ముడుపుల వ్యవహారాలు, ఆధారాల ధ్వంసం సహా అనేక అంశాలపై ఈడీ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరీ 28వ తేదీన తీహార్‌ జైల్లో బుచ్చిబాబు నుంచి కీలక విషయాలను ఈడీ అధికారులు రాబట్టారు. ఇక రేపటి కవిత విచారణకు బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. ఈ కేసులో గోరంట్లను సీబీఐ కొద్దిరోజుల క్రితమే సీబీఐ అరెస్ట్ చేసింది. తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తరువాత సీబీఐ అరెస్ట్‌ చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబు. అటు పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ మాల్హోత్రాను కూడా లిక్కర్‌స్కాం కేసులు ఈడీ తాజాగా అరెస్ట్‌ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం రూపకల్పన, అమలులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని సీబీఐ తెలిపింది. కాగా అరుణ్ పిళ్లై సీబీఐకి అప్రూవర్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన సీబీఐ, ఈడీ ముందు కీలక విషయాలు వెల్లడించారని సమాచారం.

Tags

Next Story