Delhi liquor scam: ఢిల్లీ మద్యం కేసు వ్యవహారం.. మాజీ ఆడిటర్ అరెస్ట్

Delhi liquor scam: ఢిల్లీ మద్యం కేసు వ్యవహారం.. మాజీ ఆడిటర్ అరెస్ట్
X
Delhi liquor scam: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్‌ చేసింది.

Delhi liquor scam: ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

దర్యాప్తులో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపిన అధికారులు.. ఇవాళ ఉదయం అరెస్ట్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం బుచ్చిబాబును రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బుచ్చిబాబును గతంలో అనేక సార్లు ప్రశ్నించాయి దర్యాప్తు సంస్థలు. హైదరాబాద్‌లోని ఆయన ఆఫీస్‌, ఇళ్లలోనూ సోదాలు జరిపాయి. బుచ్చిబాబు అరెస్ట్‌తో సీబీఐ అధికారులు... ఈ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

Tags

Next Story