Dengue : డెంగ్యూ నియంత్రణకు ఐక్యంగా కృషి చేయాలి: ఆమ్రపాలి

డెంగ్యూ నివారణకు ఆయా అధికారులందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కృషి చేయాలని కమిషనర్ ఆమ్రపాలి కోరారు. శుక్రవారం కమిషనర్ సంబంధిత విభాగాల అధికారులు, జోనల్ కమిషనర్ లతో నగరంలో డెంగ్యూ నియంత్రణ కు చేపట్టాల్సిన తక్షణ చర్యల పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...డెంగ్యూ హాట్ స్పాట్ పాయింట్స్ గుర్తించి, ఆయా ఏరియాలలో ప్రజలకు, పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి డెంగ్యూ లక్షణాలు, డెంగ్యూ నివారణ, కట్టడికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఏ ఎం అండ్ హెచ్ ఓ లు, ఎంటమాలజీ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
నమోదైన డెంగ్యూ కేసుల వివరాలు, సంబంధితుల అడ్రెస్ లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుండి తీసుకోవాలని తెలిపారు. వాటర్ స్టా గ్నేషన్ పాయింట్స్, సంపుల నిర్మాణ ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డెంగ్యూ ప్రబలిన ఇంటి చుట్టు పక్కల గల మిగిలిన ఇండ్ల వారికి ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జోనల్ కమిషనర్ లు తమ తమ పరిధిలో డెంగ్యూ నియంత్రణకు అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వల్నరబుల్ గార్బేజ్ పాయింట్ల తొలగింపు చర్యలను వేగవంతం చేయాలని, ఎంటమాలజీ వర్కర్స్, శానిటేషన్ కార్మికుల హాజరు శాతం మెరుగు పరచాలన్నారు. అక్రమ భవన నిర్మాణాలను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో జోనల్ కమిషనర్లు, శానిటేషన్, ఎంటమాలజీ, టౌన్ ప్లానింగ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com