ములుగు ఎన్‌కౌంటర్ వివరాలు గోప్యంగా

ములుగు జిల్లాలో నిన్నజరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఇప్పటికీ మృతి చెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. అలాగే ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలానికి మీడియాను కూడా అనుమతించలేదు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని ముసలమ్మ గట్ట అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
స్థానికంగా ఈ ఘటన అలజడి రేపింది. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను... అర్థరాత్రి పోలీసులు ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐతే వారి వివరాలను పోలీసులు ఇంకా ధృవీకరించకపోవడం గమనార్హం. ఈ ఎన్‌కౌంటర్‌తో మంగపేటలోని అటవీ ప్రాంతం ఉలిక్కిపడింది. స్థానికంగా ఘటన అలజడి రేపింది. ఈ నెల 10న మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధరాత్రి బయటకు లాక్కొచ్చి చంపారు. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసుతో అలర్టైన పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగడం చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com