DGP: పోలీసు శాఖ ప్రతిష్ట పెంచుతా: కొత్త డీజీపీ

DGP: పోలీసు శాఖ ప్రతిష్ట పెంచుతా: కొత్త డీజీపీ
X
హైదరాబాద్ సీపీగా సజ్జనార్

తె­లం­గాణ పో­లీ­సు శాఖ ప్ర­తి­ష్ట­ను పెం­చు­తా­న­ని రా­ష్ట్రా­ని­కి కొ­త్త డీ­జీ­పీ­గా ఎన్ని­కైన బత్తుల శి­వ­ధ­ర్ రె­డ్డి అన్నా­రు. తె­లం­గా­ణ­లో సై­బ­ర్ నే­రా­లు, డ్ర­గ్స్ మా­ఫి­యా­ను పూ­ర్తి­గా ని­ర్మూ­లిం­చా­ల్సిం­దే­న­ని అన్నా­రు. ప్ర­జ­ల­కు పో­లీ­సిం­గ్‌­పై నమ్మ­కా­న్ని పెం­చేం­దు­కు ప్ర­య­త్ని­స్తా­న­ని.. పో­లీ­సు వృతి అంటే తన­కెం­తో ఇష్ట­మ­ని అన్నా­రు. న్యా­య­వాద వృ­త్తి­ని వది­లి పట్టు­ద­ల­తో సి­వి­ల్స్‌­కు ప్రి­పే­ర్ అయి ఐపీ­ఎ­స్‌ సా­ధిం­చా­న­ని తె­లి­పా­రు. మవో­యి­స్టుల వ్య­వ­స్థ దా­దా­పు అం­త­మై­న­ట్లే­న­ని అన్నా­రు. గతం­లో వి­విధ జి­ల్లాల ఎస్పీ­గా, ఇం­టె­లి­జె­న్స్‌ చీ­ఫ్‌­గా పని­చే­సిన అను­భ­వం­తో తె­లం­గాణ తనకు పూ­ర్తి పట్టు ఉం­ద­ని డీ­జీ­పీ బత్తుల శి­వ­ధ­ర్‌ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని నూతన డీజీపీ వెల్లడించారు. ఇప్పటికే తె­లం­గాణ నూతన డీ­జీ­పీ­గా శి­వ­ధ­ర్‌­రె­డ్డి ని­య­మి­తు­ల­య్యా­రు. 1994 ఐపీ­ఎ­స్‌ బ్యా­చ్‌­కు చెం­దిన శి­వ­ధ­ర్‌­రె­డ్డి.. ప్ర­స్తు­తం ఇం­టె­లి­జె­న్స్‌ ఛీ­ఫ్‌­గా ఉన్నా­రు. ఈమే­ర­కు సీఎం రే­వం­త్‌­రె­డ్డి చే­తుల మీ­దు­గా ఆయన అపా­యిం­ట్‌­మెం­ట్‌ ఆర్డ­ర్‌ అం­దు­కు­న్నా­రు. తెలంగాణలో పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతానని కొత్త డీజీపీ వెల్లడించారు.

సీపీగా సజ్జనార్

తె­లం­గాణ ప్ర­భు­త్వం భా­రీ­గా ఐఏ­ఎ­స్, ఐపీ­ఎ­స్‌ అధి­కా­రు­ల­ను బది­లీ­లు, పో­స్టిం­గ్‌­లు చే­ప­ట్టిం­ది. ఆరు­గు­రు ఐఏ­ఎ­స్‌, 23 మంది ఐపీ­ఎ­స్‌ల బది­లీ­లు, పో­స్టిం­గ్‌­ల­కు సం­బం­ధిం­చి వే­ర్వే­రు­గా రెం­డు ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. ఐపీ­ఎ­స్ అధి­కా­రుల బది­లీ­ల్లో భా­గం­గా హై­ద­రా­బా­ద్ పో­లీ­సు కమి­ష­న­ర్‌­గా వీసీ సజ్జ­నా­ర్‌­ను ని­య­మిం­చిం­ది. ప్ర­స్తు­తం వీసీ సజ్జ­నా­ర్ ఆర్టీ­సీ ఎం­డీ­గా ఉన్న సం­గ­తి తె­లి­సిం­దే. ఆయ­న­ను హై­ద­రా­బా­ద్ సీ­పీ­గా బది­లీ చే­సిం­ది. ఇక, ప్ర­స్తు­తం హై­ద­రా­బా­ద్ సీ­పీ­గా ఉన్న సీవీ ఆనం­ద్‌­ను హోం­శాఖ ప్ర­త్యేక ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి­గా ని­య­మిం­చిం­ది. వి­జి­లె­న్స్ అండ్ ఎన్‌­ఫో­ర్స్‌­మెం­ట్ డీ­జీ­గా శిఖా గో­య­ల్ బా­ధ్య­త­లు చే­ప­ట్ట­ను­న్నా­రు. రా­ష్ట్ర ఇం­టె­లి­జె­న­ర్స్ చీ­ఫ్‌­గా వి­జ­య్‌­కు­మా­ర్‌­ను ని­య­మి­స్తూ.. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. రఘు­నం­ద­న్‌­రా­వు­కు ట్రా­న్స్‌­పో­ర్ట్ కమి­ష­న­ర్‌, సు­రేం­ద్ర మో­హ­న్‌­కు వ్య­వ­సా­య­శా­ఖ­ల­ను అప్ప­గిం­చిం­ది.

సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత...

ఐఏ­ఎ­స్ అధి­కా­రుల బది­లీ­ల్లో భా­గం­గా రా­జ­న్న సి­రి­సి­ల్ల జి­ల్లా కలె­క్ట­ర్‌­గా ఎం హరిత ని­య­మి­తు­ల­య్యా­రు. రా­జ­న్న సి­రి­సి­ల్ల జి­ల్లా కలె­క్ట­ర్‌ సం­దీ­ప్ కు­మా­ర్ ఝా వ్య­వ­హా­రం గత కొ­ద్ది రో­జు­లు­గా తీ­వ్ర చర్చ­నీ­యాం­శం­గా మా­రిన సం­గ­తి తె­లి­సిం­దే. తరు­చూ వి­వా­దా­ల­కు కేం­ద్ర బిం­దు­వు­గా మా­రిన ఆయ­న­పై ప్ర­భు­త్వ వర్గా­లు సీ­రి­య­స్ అయ్యా­యి. ఈ క్ర­మం­లో­నే తా­జా­గా బది­లీ­ల్లో ఆయ­న­కు స్థా­న­చ­ల­నం కలి­గిం­ది. సం­దీ­ప­కు­మా­ర్ ఝాకు టీ­ఆ­ర్ అండ్ బీ వి­భా­గం­లో స్పె­ష­ల్ సె­క్ర­ట­రీ­గా బా­ధ్య­త­లు అప్ప­గిం­చిం­ది.

Tags

Next Story