DH Srinivasa Rao: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పూజలపై వివాదం..

DH Srinivasa Rao: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలో చేసిన పూజలు వివాదాస్పదమయ్యాయి. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న ఒక మహిళా MPP చేసిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. తలపై పూజా సామాగ్రి పెట్టుకొని అక్కడ, ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వంగి, వంగి దండాలు పెడుతూ కనిపించారు. హోమాలు, యజ్ఞాలపేరుతో మంటల్లో వివిధ రకాల పూజాద్రవ్యాలు వేస్తూ, మిరపకాయలు వేస్తూ పూజలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి మూఢ నమ్మకాలు వద్దని చెపుతూ సామాన్యుల్లో అవగాహన కల్పించాలని కానీ ఆయనే ఇలాంటి పూజల్లో పాల్గొనడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వివరణ ఇచ్చారు. తనను బంజారా కమ్యూనిటీ వాళ్లు ఆహ్వానిస్తే వెళ్లాను తప్ప.. మూఢనమ్మకాలను నమ్మనని, తాను ఎలాంటి విచిత్ర పూజలు చేయలేదంటూ వివరణ ఇచ్చారు.
తాను హోమానికే దండం పెట్టాను తప్ప ఏ వ్యక్తికీ పూజల పేరుతో నమస్కరించలేదని చెప్పుకొచ్చారు. మూఢ నమ్మకలు తనకు లేవని, గిరిజనులు పిలిస్తే వెళ్లి తాను పూజల్లో పాల్గొన్న విషయాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. ఐతే.. కొత్తగూడెంకు చెందిన DH త్వరలో పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటున్నారని, అందుకే ఈ పూజలు చేశారనే ప్రచారం కూడా స్థానికంగా జోరుగా జరుగుతోంది.
ఐతే.. ఈ వార్తల్ని DH శ్రీనివాస్ రావు ఖండించారు. స్థానికంగా హెల్త్‌క్యాంప్‌లు ఏర్పాటు చేస్తు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. తాను తన తండ్రి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com