బ్రేకింగ్.. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగించిన హైకోర్టు

బ్రేకింగ్.. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగించిన హైకోర్టు
X

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈనెల 10 వరకు స్టే పొడిగించింది తెలంగాణ హైకోర్టు. అటు.. ధరణి నిబంధనలకు సంబంధించిన మూడు జీవోలపై మధ్యంతర పిటిషన్లు దాఖలయ్యాయి. లాయల్‌ గోపాల్‌ శర్మ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ధరణి జీవోలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏజీ కోరారు.

Tags

Next Story