TG: ధరణి పోర్టల్‌ను పునర్వ్యవస్థీకరిస్తాం
ధరణి పోర్టల్ ను సామాన్యులకు అందుబాటులో ఉండేలా పునర్వ్యవస్థీకరిస్తామని తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలన్నీ కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ధరణిపై ఏర్పాటైన కమిటీ సూచించినట్టు... ఆయన వెల్లడించారు. భూవివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందన్నారు.సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు M. కోదండరెడ్డి, M.సునిల్ కుమార్, మధుసూదన్ లతో మంత్రి స మావేశమై చర్చించారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది కుటుంబాలు భూ సమస్యలతో ఛిన్నాభిన్నమైనట్టు తెలిపారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతీ గ్రామంలో సుమారు 200 కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. భూ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ ను పునర్ వ్యవస్థీకరించి చట్టాల్లో మార్పులు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ధరణి కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించక ముందే అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్-బిలో ఉంచిన భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదేం నిర్ణయం
తెలంగాణలో రుణమాఫీ అమలు కోసం PM కిసాన్ సమ్మాన్ నిధి డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరికాదని..మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలన్న ఆయన ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని చెప్పారు. రైతులు ఎవరైనా రైతులేనని, ఎన్నికల హామీ ప్రకారం అందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. ఏడు నెలలు దాటినప్పటికీ...... ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.దేశంలో తొలిసారి కేసీఆర్ రైతుబంధు పథకం అమలు చేసినందున...... కేంద్రంపై మీద ఒత్తిడి పెరిగి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని... తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో 70 లక్షల మందికిపైగా రైతులు ఉంటే...... కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధిని గరిష్టంగా 36 లక్షల మందికే లబ్ది కలుగుతోందని నిరంజన్ రెడ్డి వివరించారు. భారాస హయాంలో 70లక్షలమంది రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇచ్చామన్న మాజీ మంత్రి.... ఇప్పుడు కూడా అదే తరహాలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com