Dharani : తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ స్పీడందుకున్న ధరణి రిజిస్ట్రేషన్లు..!

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లలో మళ్లీ స్పీడ్ పెరుగుతోంది. సవరించిన భూముల విలువల ఆధారంగా కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు గత నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్ వంటి ఇబ్బందుల వల్ల క్రయవిక్రయాలకు మొదట్లో ఇబ్బంది వచ్చినా.. ఇప్పుడు మళ్లీ గాడిన పడుతోంది. నెల రోజుల్లో 1 లక్షా 7 వేల 900కిపైగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 812 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
అత్యధికంగా గండిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో 112 కోట్ల ఆదాయం వచ్చింది. రంగారెడ్డి ఎస్‌ఆర్‌వోలో 78 కోట్లు, సంగారెడ్డిలో 58 కోట్లు, కుత్బుల్లాపూర్‌లో 45 కోట్లు, బంజారాహిల్స్‌లో 41 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇక ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించి నెలరోజుల్లో 87 వేల 632 లావాదేవీలు జరిగాయి. దీన్నుంచి మరో 200 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంల సంగారెడ్డి టాప్‌లో ఉంది. అక్కడ నెల రోజుల్లో 4 వేల 329 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కుత్బుల్లాపూర్‌లో 3 వేలు రిజిస్టర్ అయితే వరంగల్‌లో 2వేల 800 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com