Dharmapuri : ఆలయ పరిసరాల్లో వీధికుక్కల స్వైరవిహారం.. భయంతో స్థానికులు

Dharmapuri : ఆలయ పరిసరాల్లో వీధికుక్కల స్వైరవిహారం.. భయంతో స్థానికులు
X
ప్రతి వీధిలో 30 కుక్కలు తిరుగుతుండటంతో స్కూల్స్‌ కు వెళ్లే విద్యార్థులు, పాదచారులు భయాందోళన చెందుతున్నారు

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సరిసరాలలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి వీధిలో 30 కుక్కలు తిరుగుతుండటంతో స్కూల్స్‌ కు వెళ్లే విద్యార్థులు, పాదచారులు భయాందోళన చెందుతున్నారు. ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులు, పెద్దలపై వీధికుక్కలు దాడులు చేస్తుండటంతో స్థానిక మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లు ధర్మపురి మున్సిపల్ కమిషన ర్‌కు వినతిపత్రం అందజేశారు. కుక్కల బెడద నుండి పరిష్కారం చూపాలని కోరారు.

Tags

Next Story