Diesel Robbery: జాతీయ రహదారిపై డీజిల్ దొంగలు.. పార్కింగ్ వాహనాలే టార్గెట్

X
By - Prasanna |30 July 2022 12:07 PM IST
Diesel Robbery: ఓ ఇన్నోవా వాహనంలో తిరుగుతూ పార్కింగ్ చేసి ఉన్న వాహనాలే టార్గెట్‌గా డీజిల్ చోరీకి తెగబడుతున్నారు.
Diesel Robbery: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై డీజిల్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఓ ఇన్నోవా వాహనంలో తిరుగుతూ పార్కింగ్ చేసి ఉన్న వాహనాలే టార్గెట్‌గా డీజిల్ చోరీకి తెగబడుతున్నారు. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద పార్కింగ్ చేసి ఉన్న నాలుగు లారీల నుంచి నాలుగు వందల లీటర్ల డీజిల్ దొంగిలించారు. ఈ చోరీ దృశ్యాలు హైవేపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చోరీలను సీరియస్‌గా తీసుకున్న చిట్యాల పోలీసులు కేటుగాళ్ల కోసం వేట ప్రారంభించారు.సీఐ శివరాంరెడ్డి నేతృత్వంలో డీజిల్ దొంగల కోసం రెండు బృందాలుగా గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com