త్వరలో జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం... తుది కసరత్తు చేస్తున్న టీపీసీసీ చీఫ్...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభవార్త. చాలా కాలంగా ఎదురుచూస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం తుది దశకు చేరుకుంది. మరో రెండు మూడు రోజుల్లో డీసీసీ కమిటీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులతో చర్చలు జరుపుతున్నారు.స్థానిక నాయకుల ఆమోదంతో పాటు ఏఐసీసీ సూచనల మేరకు జిల్లా కమిటీలను కూర్పు చేస్తున్నట్లు సమాచారం. కమిటీల ఎంపికలో ఎలాంటి విభేదాలు రాకుండా, మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి నాయకులతో చివరి దశ చర్చలు జరుపుతున్నారు.
ఈ చర్చల అనంతరం రెండు, మూడు రోజులలో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలను ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, త్వరలో గ్రామ, మండల, జిల్లా కమిటీలన్నీ పూర్తి చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాగా ఈ నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com