DK Aruna: కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నాం: డీకే అరుణ

DK Aruna: కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నాం: డీకే అరుణ
DK Aruna: ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నామన్నారు డీకే అరుణ.

DK Aruna: మహిళా ఆర్థిక మంత్రిపై కేసీఆర్ మాట్లాడిన మాటలు విని.. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రం ఏం ఆశించింది, ఎక్కడ అన్యాయం జరిగిందో మాట్లాడితే గౌరవం ఉండేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్.. ఎప్పుడైనా అంబేద్కర్‌కు నివాళులు అర్పించారా అని నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న మాటతో సీఎం అయి.. ఆ దళితులనే అన్ని రకాలుగా మోసం చేశారని విమర్శించారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌.. ఎన్నికలు జరిగే ప్రతి చోటుకి వేల కోట్లు పంపిస్తున్నారంటూ ఆరోపించారు డీకే అరుణ.

Tags

Read MoreRead Less
Next Story