ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన టీఆర్ఎస్ గెలిచింది : డీకే.అరుణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన టీఆర్ఎస్ గెలిచింది : డీకే.అరుణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందితే తమకు భవిష్యత్ లేదనే టీఆర్ఎస్ అనేక దొడ్డిదారులు చూసుకుందని ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ్ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందితే తమకు భవిష్యత్ లేదనే టీఆర్ఎస్ అనేక దొడ్డిదారులు చూసుకుందని ఆరోపించారు. పీఆర్సీ ప్రకటన ఉద్యోగుల మీద ప్రేమతో కాదని.. ఎన్నికల్లో గెలవాలనే దురుద్ధేశ్యంతో ఫిట్ మెంట్ ప్రకటించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక్కోస్థానంలో వంద కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్న డీకే.అరుణ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story