Telangana High court : నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేం: తెలంగాణ హైకోర్టు

X
By - TV5 Digital Team |31 Dec 2021 12:16 PM IST
Telangana High court : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెల్చిచెప్పింది.
Telangana High court : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెల్చిచెప్పింది. న్యూఇయర్ వేడుకలపై ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారని తెలిపింది. పబ్‌లు, బార్లలో వేడుకల సమయాన్ని ప్రభుత్వం పెంచిందని, ఇక ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కొందరు కోర్టుకెళ్లారు. అయితే, పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com