Nalgonda: 'బ్రతికే ఉంది కదా..! చనిపోలేదు కదా..!'.. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం..

Nalgonda: కాన్పు కోసం సర్జరీ చేశారు. కడుపులోనే దూదిపెట్టి కుట్టేశారు. ఇదీ నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం. ఆపరేషన్ టైమ్‌లో ఆ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా 3 రోజులుగా బాలింత నరకం అనుభవించింది. బాధ తట్టుకోలేకపోతున్నానని ఆమె చెప్తున్నా పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారు. చివరికి ఆమె బంధువులు గట్టిగా నిలదీస్తే స్కానింగ్ చేసి చూశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. సిజేరియన్ టైమ్‌లో దూదిని కడుపులోనే వదిలేసి కుట్టేయడం వల్లే ఇలా జరిగిందని తెలిసి వెంటనే సర్జరీ చేసి ఆ దూదిని తొలగించారు.
తప్పంతా కళ్లముందే కనిపిస్తున్నా కూడా డాక్టర్లు సమర్థించుకుంటున్నారు. బతికే ఉంది కదా.. బాలింతరాలు చనిపోలేదు కదా అంటూ వైద్యులు, సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని జ్యోతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జరిగిన విషయాన్ని టీవీ5 దృష్టికి తెచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com