తెలంగాణ

kidney stones : అతడి కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొల‌గించిన వైద్యులు..!

kidney stones : హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.

kidney stones :  అతడి కిడ్నీలో 206 రాళ్లు.. గంటలో తొల‌గించిన వైద్యులు..!
X

kidney stones : హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు. నల్గొండకి చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య కిడ్నిలో భరించలేని నొప్పి రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

ఈ క్రమంలో టెస్టులు చేసి లెఫ్ట్ కిడ్నీలో రాళ్లున్నట్టుగా గుర్తించారు. అయితే వీటిని గంటపాటు కీ హోల్ సర్జరీ చేసి వీటిని తొలిగించారు. రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. రామలక్ష్మయ్య గతంలో కూడా పలుమార్లు ఈ నొప్పి వచ్చేది.. స్థానిక హెల్త్ ప్రాక్టిషనర్ దగ్గర చికిత్సతో తాతాల్కిక ఉపశమనం పొందేవాడు.

కానీ ఈ సమస్య ఎక్కువ కావడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరాడు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్‌ కేసులు పెరుగుతున్నాయని, దీని ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు.. వేసవికాలంలో ఎక్కువ నీరు, కొబ్బరి నీరు (వీలైతే) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story

RELATED STORIES