REVANTH: వేల కోట్లు సంపాదించుకుంటే జాతిపిత అవుతారా.?

REVANTH: వేల కోట్లు సంపాదించుకుంటే జాతిపిత అవుతారా.?
X
కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు... బీఆర్ఎస్ ఆందోళనలపై రేవంత్ ఘాటు స్పందన.. కేసీఆర్‌ను జాతిపిత అనడంపై తీవ్ర ఆగ్రహం

మాజీ ము­ఖ్య­మం­త్రి కే­సీ­ఆ­ర్ లక్ష్యం­గా సీఎం రే­వం­త్ రె­డ్డి తీ­వ్ర­స్థా­యి­లో వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. 2025 సం­వ­త్స­రా­ని­కి గాను ప్ర­తి­ష్టా­త్మక ‘రావి నా­రా­యణ రె­డ్డి స్మా­రక జా­తీయ అవా­ర్డు’ వే­డు­క­ల­ను హై­ద­రా­బా­ద్ లో­ట­స్ పాం­డ్‌­లో­ని రావి నా­రా­యణ రె­డ్డి ఆడి­టో­రి­యం­లో అట్ట­హా­సం­గా ని­ర్వ­హిం­చా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి ము­ఖ్య అతి­థి­గా హా­జ­రైన సీఎం రే­వం­త్ రె­డ్డి జస్టి­స్ సు­ద­ర్శ­న్ రె­డ్డి­ని ఘనం­గా సన్మా­నిం­చి రావి నా­రా­యణ రె­డ్డి జా­తీయ స్మా­రక అవా­ర్డు­ను అం­ద­జే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆయన మా­ట్లా­డు­తూ ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­లో సిట్ అధి­కా­రు­లు నో­టీ­సు­లు జారీ చే­య­డం­పై బీ­ఆ­ర్ఎ­స్ శ్రే­ణు­లు చే­స్తు­న్న ఆం­దో­ళ­న­ల­పై ఆయన ఘా­టు­గా స్పం­దిం­చా­రు. ‘తె­లం­గాణ జా­తి­పి­త­కు నో­టీ­సు­లు ఇస్తా­రా..?’ అని కొం­ద­రు ప్ర­శ్నిం­చ­డా­న్ని రే­వం­త్ రె­డ్డి తప్పు­బ­ట్టా­రు. అసలు ఆద­ర్శం ఏమి­టి..? తె­లం­గాణ వచ్చిన తర్వాత కే­వ­లం తన కు­టుంబ సభ్యు­ల­కే పద­వు­లు ఇచ్చు­కు­న్న వ్య­క్తి జా­తి­పిత ఎలా అవు­తా­ర­ని రే­వం­త్ ప్ర­శ్నిం­చా­రు. ని­జం­గా ఆయన జా­తి­పిత అయి­తే, ఏ వి­ష­యం­లో ఆద­ర్శం­గా ని­లి­చా­రో చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. ‘ఎవరూ ఇక్కడ రా­జు­లు, చక్ర­వ­ర్తు­లు కా­ద­ని.. ప్ర­జా­స్వా­మ్యం­లో ఎవ­రై­నా చట్టా­ని­కి లో­బ­డి ఉం­డా­ల్సిం­దే­న­ని సీఎం రే­వం­త్ రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. గత ప్ర­భు­త్వ హయాం­లో ఉద్య­మ­కా­రు­ల­ను గౌ­ర­విం­చా­మ­న్న వా­ద­న­ను రే­వం­త్ రె­డ్డి తి­ప్పి­కొ­ట్టా­రు. ‘ప్రొ­ఫె­స­ర్ కో­దం­డ­రాం ఉద్య­మ­కా­రు­డు కాదా..? అప్ప­ట్లో ఆయన ఇంటి తలు­పు­లు బద్ద­లు కొ­ట్టి ఈడ్చు­కె­ళ్లి అరె­స్ట్ చే­య­లే­దా?’ అని ని­ల­దీ­శా­రు.

ప్రశ్నించవద్దంటే ఎలా?: రేవంత్‌రెడ్డి

‘‘ని­జాం పా­ల­కు­ల­కు వ్య­తి­రే­కం­గా రావి నా­రా­య­ణ­రె­డ్డి పో­రా­టం చే­శా­రు. నాడు ప్ర­జల కష్టా­లు, రా­చ­రిక పో­క­డ­లు, అరా­చక చర్య­ల­పై పో­రా­డా­రు. 500 ఎక­రాల భూ­మి­ని పే­ద­ల­కు పంచి ఆద­ర్శం­గా ని­లి­చా­రు. స్వే­చ్ఛ­ను హరిం­చి, హక్కు­ల­కు భంగం కలి­గి­స్తే తి­రు­గు­బా­టు వస్తుం­ది. ప్ర­జల తి­రు­గు­బా­టు సా­యుధ పో­రా­టం­గా మా­రు­తుం­ద­ని ఆయన చాటి చె­ప్పా­రు. 60 ఏళ్లు వచ్చే­స­రి­కి రా­జ­కీయ పదవీ వి­ర­మణ చే­సిన గొ­ప్ప నా­య­కు­డు రావి నా­రా­య­ణ­రె­డ్డి. ప్ర­జల నుం­చి తి­ర­స్కా­రం పొం­ది­నా.. నేటి నే­త­ల­కు పదవీ వ్యా­మో­హం పో­వ­డం లేదు. తె­లం­గా­ణ­లో పద­వు­ల­న్నీ కే­సీ­ఆ­ర్‌ కు­టుం­బం అను­భ­విం­చిం­ది. వందల ఎక­రాల ఫా­మ్‌­హౌ­స్‌­లు, వేల కో­ట్ల వ్యా­పా­రా­లు మీ­కె­లా వచ్చా­యి..? బీ­ఆ­ర్‌­ఎ­స్‌ నే­త­లు చే­యా­ల్సిన తప్పు­ల­న్నీ చే­శా­రు. నే­రా­లు చే­స్తాం.. పశ్నిం­చ­వ­ద్ద­ని మీ­రె­లా అం­టా­రు? అక్రమ మా­ర్గా­లు ఎం­చు­కు­న్న­ప్పు­డు ప్ర­జా­స్వా­మ్య­బ­ద్ధం­గా వి­చా­రణ తప్ప­దు’’ అని సీఎం స్ప­ష్టం చే­శా­రు. రావి నా­రా­యణ రె­డ్డి నే­ష­న­ల్ అవా­ర్డు పొం­ద­డం ఎంతో గొ­ప్ప­ది­గా భా­వి­స్తా­న­ని అవా­ర్డు గ్ర­హీత జస్టి­స్‌ సు­ద­ర్శ­న్‌ రె­డ్డి అన్నా­రు. రావి నా­రా­యణ రె­డ్డి ని­త్య చై­త­న్య స్ఫూ­ర్తి అని కొ­ని­యా­డా­రు. సొంత ఆస్తు­ల­ను ప్ర­జ­ల­కు పం­చిన మహా­ను­భా­వు­డ­ని ప్ర­శం­సిం­చా­రు. రావి నా­రా­య­ణ­రె­డ్డి పు­ర­స్కా­రా­న్ని జస్టి­స్‌ సు­ద­ర్శ­న్‌­రె­డ్డి­కి సీఎం ప్ర­దా­నం చే­శా­రు.

Tags

Next Story