వనస్థలిపురం రైతు బజార్ వద్ద డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో... 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను.. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు... GHMC కమిషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సెల్లార్, స్టిల్ట్, 9 అంతస్తుల్లో... మూడు బ్లాకుల్లో... 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇళ్లలో.. ఒక హాల్, రెండు డబుల్ బెడ్‌రూమ్‌లు, ఓ కిచెన్, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి 8 లక్షల 65 వేల రూపాయలు ఖర్చు చేశారు. బుధవారం ఆ ఇళ్లను.. లబ్దిదారులకు ఉచితంగా అందించారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా రెండు పడక గదుల నిర్మాణం చేపట్టినట్టు కేటీఆర్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 72 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. ఈ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్దిదారులకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com