DRUGS: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ముఠా పట్టుబడటం కలకలం రేపింది. నార్కోటిక్స్ వింగ్ పోలీసుల దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైతో సంబంధం ఉన్న హైదరాబాద్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కొకైన్, ఎఫిడ్రన్ సరఫరా చేస్తున్న 9 మంది డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు కొకైన్, మరో ముగ్గురు మియావ్ మియావ్ ఎండీ డ్రగ్ అఫెండర్స్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 ఎక్సాటసీ పిల్స్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కంట్రీ మేడ్ తుపాకీ, ఆరు రౌండ్ల లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో వీరితోపాటు డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న మరో ఇద్దరు విదేశీయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే వీరిని డిపోర్టేషన్ చేయనున్నారు. కాటేదాన్ లో డ్రగ్స్ దందా చేస్తున్న మరో వ్యక్తిని పట్టుకున్నామని .. నిందితులకు ముంబైతో లింకులున్నాయని సీపీ ఆరంద్ వెల్లడించారు. నైజీరియన్లతో పాటు ఏడు మంది అరెస్టు చేశామని.. నిందితుల్లో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా ఉన్నారని తెలిపారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ముంబైతో సంబంధం ఉన్న మూడు టీంలను పట్టుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com