EAGLE : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ పార్టీ

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ మరోసారి వార్తల్లోకెక్కింది. పొలిటికల్ ప్రముఖుల వీకెండ్ డ్రగ్ పార్టీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో ఓ ఎంపీతోపాటు.. పొలిటికల్ లీడర్లు, వీఐపీలు పాల్గొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా.. ఓ మహిళ కూడా ఉండటం.. తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. అంతేకాకుండా.. ఓ మహిళ కూడా ఉండటం.. తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీమ్.. ఫామ్‌హౌస్‌లో రెండు గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఫామ్‌హౌస్‌లో పైలట్ రోహిత్ పార్టీ నిర్వహించారని.. వీరంతా హాజరయ్యారని తెలిపారు. ఈగల్ టీమ్‌ను చూసి నమిత్ శర్మ గాల్లో ఫైర్ చేశారని.. గన్ లైసెన్స్ రితేష్‌రెడ్డి పేరు మీద ఉందని తెలిపారు. దాడుల్లో రెండు గ్రాముల వైట్ పౌడర్‌ను సీజ్ చేశామని.. అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒక మహిళ, వ్యాపారి, రియల్టర్స్ ఉన్నారన్నారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఐదుగురు.. గతంలో వేరే చోట డ్రగ్స్ తీసుకున్నామని చెబుతున్నారన్నారు. ఫామ్‌హౌస్‌లపై కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నామని.. తమకు ఇంటెలిజెన్స్ టీమ్ కూడా ఉందని చేవెళ్ల డీసీపీ తెలిపారు.
అసలేం జరిగిందంటే
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ మరోసారి వివాదాస్పద ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి అక్కడ జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి పార్టీని భగ్నం చేయడంతో పాటు కొకైన్, తుపాకీ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించగా, ప్రాథమిక డ్రగ్ పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.ఈ పార్టీలో మొత్తం పది మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో తొమ్మిది మంది పురుషులు కాగా, ఒక మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పార్టీలో రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి అనే వ్యక్తులకు డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇదే పార్టీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ కూడా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ ఈ వీకెండ్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డ్రగ్ వినియోగంపై పూర్తి నిర్ధారణ కోసం నిందితుల నుంచి సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.
రెండు లగ్జరీ కార్లు సీజ్
పోలీసుల సోదాల్లో ఫాంహౌస్ ప్రాంగణంలో ఉన్న రెండు లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. TS09FE3929, TS09FE3939 నంబర్లతో ఉన్న ఆ వాహనాలను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అదేవిధంగా ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కా పైప్స్ వంటి పరికరాలను కూడా సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, డ్రగ్స్ వినియోగించడం, ఆయుధాల దుర్వినియోగం వంటి అంశాలపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక మాజీ ఎమ్మెల్యే నివాసంలో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేయడం, డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ రావడం వంటి అంశాలు సంచలనంగా మారాయి. ఇదే ఫాంహౌస్ గతంలో కూడా ఒక పెద్ద రాజకీయ వివాదానికి కేంద్రంగా నిలిచింది. అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ఇదే ఫాంహౌస్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ పార్టీ, తుపాకీ కాల్పుల ఘటనతో అదే స్థలం మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పార్టీలో లభించిన డ్రగ్స్, వెపన్‌పై పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చిన కౌశిక్ రవి.. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై BNS 109తోపాటు ఆర్మ్స్ యాక్ట్..కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
