DRUGS: హైదరాబాద్‌లో ఏకంగా డ్రగ్స్ సామ్రాజ్యమే

DRUGS: హైదరాబాద్‌లో ఏకంగా డ్రగ్స్ సామ్రాజ్యమే
X
కలకలం రేపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ భాగోతం

పే­రు­కే ల్యా­బ్.. లోపల మా­త్రం డ్ర­గ్స్‌ డె­న్‌. ఇన్నా­ళ్లూ డ్ర­గ్స్‌ మా­త్ర­మే పట్టు­బ­డిం­ది. కానీ ఇప్పు­డు ఏకం­గా డ్ర­గ్స్‌ సా­మ్రా­జ్య­మే వె­లు­గు చూ­సిం­ది. ఇది ఎక్క­డో కాదు. మన హై­ద­రా­బా­ద్‌ అడ్డ­గా­నే డ్ర­గ్స్‌ ప్రా­సె­స్‌ జరు­గు­తోం­ది. మహా­రా­ష్ట్ర­లో ఒక చి­న్న క్లూ­తో మొ­ద­లైన వేట... హై­ద­రా­బా­ద్‌­లో భారీ డ్ర­గ్స్ ఫ్యా­క్ట­రీ బం­డా­రం బట్ట­బ­య­లు చే­సిం­ది. మహా­రా­ష్ట్ర పో­లీ­సుల బి­గ్‌ ఆప­రే­ష­న్‌­లో ఈ డ్ర­గ్స్‌ డె­న్‌ బయ­ట­ప­డిం­ది. హై­ద­రా­బా­ద్‌­లో భారీ డ్ర­గ్స్‌ తయా­రీ సిం­డి­కే­ట్‌­ను మహా­రా­ష్ట్ర­లో­ని మిరా-భయం­ద­ర్ పో­లీ­సు­లు ఛే­దిం­చా­రు. చర్ల­ప­ల్లి­లో­ని వా­గ్దే­వి ల్యా­బ్స్‌ కె­మి­క­ల్‌ ఫ్యా­క్ట­రీ నుం­చి 32 వేల లీ­ట­ర్ల రా మె­టీ­రి­య­ల్‌ స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్‌­లో దీని వి­లు­వల అక్ష­రాల 12 వేల కో­ట్ల.. ఈ ఆప­రే­ష­న్‌­లో 13 మం­ది­ని పో­లీ­సు­లు అరె­స్ట్ చే­శా­రు. 200 గ్రా­ముల ఎండీ డ్ర­గ్స్‌­ను మా­త్ర­మే పట్టు­కు­న్నా­రు. వాటి వి­లువ 25 లక్ష­లు. లో­తు­గా దర్యా­ప్తు చే­య­డం­తో ఈ భారీ డ్ర­గ్ సిం­డి­కే­ట్ వె­లు­గు­లో­కి వచ్చిం­ది.

సీక్రెట్‌ టీమ్‌తో స్పెషల్‌ ఆపరేషన్

మహా­రా­ష్ట్ర­కు చెం­దిన మిరా-భయం­ద­ర్ పో­లీ­సు­లు కొ­న్నా­ళ్లు­గా ఓ డ్ర­గ్స్ ము­ఠా­పై నిఘా పె­ట్టా­రు. తమ సీ­క్రె­ట్‌ టీ­మ్‌­ను రం­గం­లో­కి దిం­చి వా­రాల పాటు రహ­స్య ఆప­రే­ష­న్ ని­ర్వ­హిం­చా­రు. ముఠా మూ­లా­లు హై­ద­రా­బా­ద్‌­లో­ని చర్ల­ప­ల్లి­లో ఉన్న­ట్లు పక్కా సమా­చా­రం అం­దు­కు­న్న పో­లీ­సు­లు, స్థా­నిక ఫ్యా­క్ట­రీ­పై మె­రు­పు­దా­డి చే­శా­రు. ఫ్యా­క్ట­రీ­లో తయా­రైన డ్ర­గ్స్‌­ను దే­శం­లో­ని వి­విధ ప్రాం­తా­ల­కు తర­లి­స్తు­న్న­ట్లు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు. అత్యంత ప్ర­మా­ద­క­ర­మైన మోలీ, ఎక్స్‌­టీ­సీ డ్ర­గ్స్‌ సర­ఫ­రా చే­స్తు­న్న­ట్లు పో­లీ­సు­లు తే­ల్చా­రు. మి­థై­లె­నె­డి­యా­క్సీ మె­థాం­ఫె­ట­మై­న్‌ ముడి పదా­ర్థా­లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. వి­దే­శా­ల్లో కూడా ఈ ముఠా పె­ద్ద నె­ట్‌­వ­ర్క్‌­ను నడు­పు­తుం­ది. డ్ర­గ్స్‌ తయా­రీ కోసం ఆధు­నిక మె­షి­న్లు ఉప­యో­గిం­చి­న­ట్లు గు­ర్తిం­చా­రు.

రేవంత్‌ సర్కార్‌కు సవాల్

మాదక ద్ర­వ్యాల క‌­ట్ట­‌­డి­కి ఎన్ని ర‌­కాల చ‌­ర్య­లు చే­ప­‌­ట్టి­నా… త‌­మ­‌­ను అడ్డు­కు­నే వా­ళ్లు లే­ర­‌­న్న­తీ­రు­గా స్మ­‌­గ్ల­‌­ర్లు పా­ల­‌­కు­ల­‌­కు స‌­వా­ల్ వి­సు­రు­తు­న్నా­రు. స్మ­‌­గ్ల­‌­ర్లు మాదక ద్ర­వ్యా­ల­ను య‌­థే­చ్ఛ­గా అమ్మ­‌­డ­‌­మే కాదు.. యూ­ని­వ­‌­ర్సి­టీ­లు, కా­లే­జీ­లు, చి­వ­‌­ర­‌­కు పా­ఠ­‌­శా­ల­‌­లు, ఐటీ కం­పె­నీల సెం­ట­‌­ర్ల­‌­ను త‌మ అడ్డా­లు­గా మా­ర్చు­కు­న్నా­ర­‌­ని తె­లు­స్తు­న్న­ది. ఇటీ­వ­‌­లే మ‌­హేం­ద్ర యూ­ని­వ­‌­ర్సి­టీ­లో మాదక ద్ర­వ్యా­లు దొ­ర­‌­క­‌­డం క‌­ల­‌­క­‌­లం రే­పిన వి­ష­‌­యం అం­ద­‌­రి­కి తె­లి­సిం­దే. మాదక ద్ర­వ్యాల వి­ని­యో­గ­పై కాం­ప్రె­న్సి­వ్ నే­ష­‌­న­‌­ల్ స‌­ర్వే (2019) ప్ర­‌­కా­రం తె­లం­గా­ణ­‌­లో 19.07 ల‌­క్ష­‌ల మం­ది­కి వి­విధ మాదక ద్ర­వ్యాల వి­ని­యోగ వ్య­‌­స­‌­నం ఉన్న­‌­ట్లు తె­లి­సిం­ది. ఇది దే­శం­లో­ని వ్య­‌­స­‌న ప‌­రు­ల­‌­లో 2.47 శా­తం­కు స‌­మా­న­‌­మ­‌­ని పే­ర్కొ­న్న­‌­ది. మాదక ద్ర­వ్యాల కే­సు­ల­ను ప‌­రి­శీ­లి­స్తే ఎన్‌­డీ­పీ­ఎ­స్ చ‌­ట్టం కింద 2014లో 148 అరె­స్టు­లు జ‌­రి­గి­తే 2023లో 1218 కే­సు­ల­లో 1991 మంది అరె­స్టు కాగా 20,904 కి­లోల మాదక ద్ర­వ్యా­ల­ను ధ్వం­సం చే­శా­రు. 2024 జ‌­న­‌­వ­‌­రి నుం­చి జూన్ వ‌­ర­‌­కే 1982 కే­సు­లు న‌­మో­దు చేసి 3,792 మంది అరె­స్టు చేసి, రూ.179 కో­ట్ల వి­లు­వైన మాదక ద్ర­వ్యా­ల­ను, రూ. 47 కో­ట్ల ప్రా­ప­‌­ర్టీ స్వా­ధీ­నం చే­సు­కు­న్న­ట్లు రి­కా­ర్డు­లు చె­పు­తు­న్నా­యి.

హైదరాబాద్‌లో తయారీ యూనిట్లా..?

మాదక ద్ర­వ్యాల వి­ని­యో­గం పె­రు­గు­తు­న్న తీరు.. మ‌రో వైపు ఇక్క­‌­డే త‌­యా­రీ యూ­ని­ట్లు వె­లి­సిన తీ­రు­ను ప‌­రి­శీ­లి­స్తే స్మ­‌­గ్ల­‌­ర్లు తమ­నే­మీ చే­య­లే­రం­టూ పా­ల­‌­కు­ల­‌­కు స‌­వా­ల్ వి­సు­రు­తు­న్నా­ర­‌­ని పరి­శీ­ల­కు­లు అం­టు­న్నా­రు. స్మ­‌­గ­‌­ర్ల­‌­కు కూడా బ‌డా నే­త­‌­ల­‌­తో ఏవై­నా సం­బం­ధా­లు పె­ట్టు­కొ­ని ఇష్టా­రా­జ్యం­గా మాదక ద్ర­వ్యా­లు వి­క్ర­యి­స్తు­న్నా­రా? అనే సం­దే­హా­లు కూడా వ్య­‌­క్తం చే­స్తు­న్నా­రు. తె­లం­గాణ రా­ష్ట్రం ఏర్పా­టు త‌­రు­వాత వ‌­రు­స­‌­గా 10 ఏళ్లు ము­ఖ్య­‌­మం­త్రి­గా ప‌ని చే­సిన కే­సీ­ఆ­ర్.. కేం­ద్రం 1985లో తీ­సు­కు వ‌­చ్చిన ఎన్‌­డీ­పీ­ఎ­స్ చ‌­ట్టా­న్ని క‌­ఠి­నం­గా అమ­‌­లు చే­స్తా­మ­‌­ని ప్ర­‌­క­‌­టిం­చా­రు. జా­మీ­న్లు ఇవ్వ­‌­కుం­డా ప్ర­‌­త్యేక కో­ర్టు­లు ఏర్పా­టు చేసి, సె­క్ష­‌­న్ 27(ఏ) కింద మాదక ద్ర­వ్యాల ట్రా­ఫి­కిం­గ్‌, ఫం­డిం­గ్ కింద శి­క్ష­‌­లు వి­ధిం­చా­రు. ఎక్సై­జ్ చ‌­ట్టా­ని­కి స‌­వ­‌­ర­‌­ణ­‌­లు చేసి అధి­కా­రు­ల­‌­కు ప్ర­‌­త్యేక అధి­కా­రా­లు క‌­ల్పిం­చా­రు. టా­లీ­వు­డ్ డ్ర­‌­గ్ కే­సు­లు వె­లు­గు­లో­కి రా­గా­నే ప్ర­‌­త్యేక సిట్ ఏర్పా­టు చేసి సినీ ప్ర­‌­ము­ఖు­లు, కా­లే­జీ వి­ద్యా­ర్థు­ల­‌­పై వి­చా­ర­‌ణ జ‌­రి­పిం­చా­రు.

Tags

Next Story