దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

రేపటి దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. లక్షా 98 వేల 756 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 3 వేల 6 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 2 వేల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు.. మైక్రో అబ్జర్వర్లు, సీసీ కెమెరాలతో పాటు వీడియో గ్రఫీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు 89 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు పోలీసులు. ఇందులో 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అటు కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు ఎన్నికల అధికారులు. ఇందు కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్ ఏర్పాటు చేశారు. 130 మంది కోవిడ్ బాధితులకు ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు ఎన్నికల అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com