దుబ్బాక ఉప ఎన్నిక.. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు..

దుబ్బాక ఉప ఎన్నిక.. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు..

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేట, చీకోడ్‌ గ్రామాల్లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అబద్దాలు, బోగస్‌ ప్రచారంలో బీజేపీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాల్సిందే అని హరీష్‌రావు ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మందు బస్తాలకు..చెప్పులు లైన్‌లో పెట్టే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌.. కరెంట్‌ ఇయ్యక చంపారు.. బీజేపీ మీటర్లు పెట్టి చంపుతారట అని రెండు పార్టీలపై మంత్రి హరీష్‌రావు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.


Tags

Read MoreRead Less
Next Story