ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది : మంత్రి హరీశ్‌రావు

దుబ్బాకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం తమదంటే తమదంటూ.. ప్రచారం చేస్తున్నారు నేతలు సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనాపూర్, గుడికందుల గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. గత పాలకులు భూమి యజమానుల నుంచి శిస్తు వసూలు చేస్తే.... సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా డబ్బులు ఇస్తున్నారని అన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గోదావరి జలాలను సిద్దిపేట జిల్లాకు తీసుకొచ్చిన ఘనత.. సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాల్గన్నారు. కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్‌తోనే తాను చర్చకు సిద్ధమని అన్నారు. నాలుగు సంక్షేమ పథకాల్లో కేంద్రం దుబ్బాక నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ఈ విషయం నిరూపించలేకపోతే తాను ఉరి వేసుకోవడానికి సిద్ధమని స్పష్టంచేశారు. దేశంలో రామరాజ్యం నడుస్తుంటే.. రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోందని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గంలో ఇంటింటికి పది లక్షల రూపాయలు ఇప్పిస్తామని హామీ అన్నారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పర్యటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. దుబ్బాకలో ఎక్కడ చూసినా మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే కనిపిస్తోందని అన్నారు. ముత్యంరెడ్డి ఆశయాల్ని కొనసాగించేందుకు ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
దుబ్బాక ఎన్నికకు శాంతి భద్రతల పరిశీలకుడిగా నియామకమైన సరోజ్ కుమార్‌ను బీజేపీ నేతలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి కలిసి.. వినతి పత్రం సమర్పించారు. టీఆర్‌ఎస్ దౌర్జన్యానికి పాల్పడుతోందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తానని సరోజ్ కుమార్ హామీ ఇచ్చినట్టు బీజేపీ నేతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com