దుబ్బాకలో విజేత ఎవరో మరి కాసేపట్లో.. తొలి రౌండ్‌లో..

టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దంతో రాజకీయ వేడి రగులుకుంది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందనరావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే.
ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 1,64,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. దాదాపు 82.61 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. సిద్ధిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది.
తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ఇప్పటి వరకు జరిపిన కౌంటింగ్‌లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపట్టారు. 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కాసేపట్లో తెలుస్తుంది.
కొవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కౌంటింగ్ ప్రక్రియన చేపట్టారు. 23 రౌండ్లలో లెక్కింపు జరుగుతోంది. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com