తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్‌

తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్‌
తెలంగాణా ఎంసెట్ కౌన్సిలింగ్ నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ 36 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కోవిడ్ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రక్రియలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

తెలంగాణా ఎంసెట్ కౌన్సిలింగ్ నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ 36 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కోవిడ్ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రక్రియలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలకు అనుగుణంగా విద్యార్ధులు మాస్కులు ధరించి, ఒకేసారి కాకుండా వారికి కేటాయించిన స్లాట్ సమయానికి రావాలని సూచించారు. ఇంతకు ముందు స్లాట్స్‌ సమయం 60నిమిషాలు ఉండగా... ఇప్పుడు ఆ సమయాన్ని 30నిమిషాలకు కుదించింది. ర్యాంకుల వారికిగా ప్రకటించిన విద్యార్ధులనే కేంద్రంలోకి అనుమతి ఇస్తామని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.

మొదటి విడత కౌన్సిలింగ్ ఈనెల 27న ముగియనుండగా... చివరి విడత ప్రక్రియ ఈనెల 29 నుంచి నవంబర్ 5 వరకు ఉంటుందని తెలిపింది. అయితే ప్రైవేటు ఇంజనీరింగ్, బీ-ఫార్మసీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణ ఆలస్యం కావడంతో కౌన్సిలింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ సారి 28 రోజుల్లోనే మొదటి,చివరి విడత కౌన్సిలింగ్‌ ను పూర్తిచేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story