ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన 'ఈటల'..

Eetala Rajendar: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. శామీర్ పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో బయలు దేరిన ఆయన గన్‌పార్కుకు చేరుకుని అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీకి వెళ్లి అక్కడ స్పీకర్ కార్యాలయంలో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాను. ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. తనను రాజీనామా చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. తాను ప్రజల మద్దతునే ఇన్నాళ్లు గెలుస్తూ వచ్చానని అన్నారు.
కాగా, ఈటల ఈనెల 14న భాజాపాలో చేరడం ఖాయమైంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కలిసి వచ్చారు. ఇక ాయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, గండ్ర నళిని, బాబయ్య తదితరులు కూడా భాజపాలో చేరడానికి సన్నద్ధమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com