Eatela Rajender : టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు : ఈటల రాజేందర్

Eatela Rajender : టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు : ఈటల రాజేందర్
X
Eatela Rajender : బీజేపీలో చేరేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారన్న ఈటల రాజేంద్.

Eatela Rajender : సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధమంటూనే బీజేపీలో చేరేందుకు టీఆర్ఎస్‌లో చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసింది. బీజేపీ, ఈటల టార్గెట్‌గా టీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈటల రాజేందర్‌వి వెన్నుపోటు రాజకీయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు కాదు వార్డు మెంబర్ కూడా ఈటలకు టచ్‌లో లేరని కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్‌లో ఓటమి భయంతోనే గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల అంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న బాల్క సుమన్.. రాబోయే రోజుల్లో ఈటలకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Tags

Next Story