EC: లోక్సత్తా సహా 9 పార్టీల గుర్తింపు రద్దు

తెలంగాణలో 9 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్రంలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో డీలిస్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. రద్దయిన పార్టీల్లో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత దేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్ సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నాయి. ఈ పార్టీలన్నీ నమోదు అయినప్పటికీ గుర్తింపు పొందలేదని, ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం–1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం రద్దు చేసిందని సుదర్షన్ రెడ్డి వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com