EC: స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగరా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్థానిక సంస్థల షెడ్యూల్ ను ఎస్ఈసీ రాణి కుముదిని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభంకానున్నాయి. మొదట ఎంపీటీడీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అయిదు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు ఇవే
మొదటి దశ:
అక్టోబర్ 9 స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అక్టోబర్ 9 ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి దశ నామినేషన్ల స్వీకరణ
అక్టోబర్ 11 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
అక్టోబర్ 15 నామినేషన్ల ఉపసంహరణ గడువు
రెండో దశ:
అక్టోబర్ 15న రెండో దశ నామినేషన్ల స్వీకరణ ఆరంభం.
అక్టోబర్ 19న నామినేషన్ల ఉప సంహరణకు గడువు
అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎన్నికలు.
నవంబర్ 11న ఫలితాలు
సర్పంచ్ ఎన్నికల తేదీలు ఇవే
ఫేజ్1: అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న ఎన్నికలు.. అదే రోజు కౌంటింగ్
ఫేజ్ 2: అక్టోబర్ 21 నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, అదే రోజు కౌంటింగ్
ఫేజ్ 3: అక్టోబర్ 25 నామినేషన్లు, నవంబర్ 8న పోలింగ్, అదే రోజు కౌంటింగ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com