MLA Rohit Reddy: ఎమ్మెల్యేల ఎర కేసు.. దూకుడు పెంచిన ఈడీ

MLA Rohit Reddy: ఎమ్మెల్యేల ఎర కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇవాళ రోహిత్ రెడ్డిని మరోసారి విచారించనుంది. ఇప్పటికే రెండు రోజుల పాటు రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ పలు విషయాలను రాబట్టింది. అయితే ఈ నెల 27 మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కోర్టులో రిట్ పిటీషన్ వేసిన రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఇక కోర్టు తీర్పు తరువాతే విచారణకు వస్తానని ఈడీకి చెప్పారు...రోహిత్ రెడ్డి. అయితే రోహిత్ రెడ్డి పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేయడంతో నేడు విచారణకు రావాల్సిందిగా రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే బాధితుడిగా ఉన్న తనను ఈడీ వేదిస్తోందని రోహిత్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. నిందితులను విచారించకుండా తనను విచారించడమేంటని ప్రశ్నించారు. ఇక నిందితులతో పాటు రోహిత్ రెడ్డిని కూడా విచారిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు హాజరుకావాలని చెప్పింది. అయితే తొలి నుంచి ఈ కేసులో ఈడీ విచారణను వ్యతిరేకిస్తున్న రోహిత్ రెడ్డి..ఇవాళ విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది సస్పెన్షన్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com