ఈడీ ఎదుట అంజన్‌ కుమార్ యాదవ్‌

ఈడీ ఎదుట అంజన్‌ కుమార్ యాదవ్‌
విచారణకు రావాలంటూ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఈడీ అధికారులు రెండోసారి నోటీసులు ఇచ్చారు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్‌ మరోసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. అంజన్ కుమార్‌పై యంగ్ ఇండియా ఫౌండేషన్ చారిటీ సంస్థకు 20 లక్షలు విరాళం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణకు రావాలంటూ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఈడీ అధికారులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. గత నవంబర్‌లోనూ అంజన్‌కుమార్‌ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. మరోసారి 20 లక్షల విరాళం అంశంపై ఈడీ అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

చివరిసారి అంజన్ కుమార్ యాదవ్ ను మూడుగంటల పాటు విచారింది ఈడీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే విరాళం ఇచ్చినట్లు ఆయన గతంలోనే తెలిపారు. కాగా మరోమారు ఈ విషయంపైనే ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేనే విచారించిన సంగతి తెలిసిందే.


Tags

Read MoreRead Less
Next Story