Chikoti Praveen : ఆ హీరోయిన్లకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన చీకోటి ప్రవీణ్..

Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్.. చీకటి సామ్రాజ్యాన్ని చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వుది. సినిమాల్లో విలన్ రెంజ్‌లో లైఫ్ స్టైల్ మార్చుకున్నాడు. లెక్కలేనంత డబ్బు.. చుట్టూ పనివాళ్లు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలతో స్నేహాలు.. రాజకీయాల నాయకులతో అనుబంధాలు, విదేశాల్లో ఆటలు- పాటలు. అబ్బో ఆయన రేంజే వేరు. ఇక ఆయన ఫామ్ హౌస్‌కు వెళ్తే పాముల హౌస్‌లకు వెళ్లినట్టే ఉంటుంది.
రంగు రంగుల పాములను, వింత జంతువులను , పక్షులను పెంచుకుంటున్నాడు. జంతు ప్రేమికులంటే కుక్కలనో, పిల్లులనో పక్షులనో పెంచుకుంటారు. కానీ చికోటి ప్రవీణ్ మాత్రం పాములను ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఆయన ఖాళీ టైం అంతా పాములతోనే టైంపాస్ చేస్తుంటాడు.
ఈ రేంజ్‌లో లైఫ్ స్టైల్ అనుభవిస్తున్న చికోటి ప్రవీణ్ బర్త్ డే వస్తే.. ఇక ఆ పార్టీ ఎలా ఉంటుందో.. ఊహించుకోవచ్చు. రీసెంట్‌గా జరిగిన ప్రవీణ్ బర్త్‌డే పార్టీపై ఆరా తీసిన ఈడీ అధికారులకు దిమ్మతిరిగేపోయే నిజం బయటపడింది. బర్త్‌డే పార్టీకోసం సింగల్ నైట్ రూ.5కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ అధికారులు వద్ద సమాచారం ఉంది. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులు క్యూ కట్టినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డిసీసీబీ ఛైర్మన్లు ఇలా సెలబ్రెటీలంతా చికోటి ప్రవీణ్ బర్త్ డేను సెలబ్రెట్ చేసుకున్నారు. అయితే ఇన్ని కోట్లు ఇలా వచ్చాయన్న దానిపై కూడా ఈడీ అధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ డబ్బంతా హవాల రూపంలో చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో లాగుతున్న కొద్ది డొంక కదులుతోంది. చికోటి చుట్టూ ఈడీ ఉచ్చుబిగుస్తోంది. ప్రవీణ్ వాట్సప్‌లో కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. వీటి ఆధారంగా చికోటి చరిత్ర పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ప్రముఖులతో జరిగిన కాంటాక్ట్ డిటైల్స్, నగదు లావాదేవీల వివరాలు అన్నీ ఉన్నాయి. 10మంది సినీ ప్రముఖులతోపాటు 20 మంది ప్రజాప్రతినిధుల వివరాలు ప్రవీణ్ మొబైల్ ఫోన్లో
ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగా లింక్స్ ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు పంపించనున్నారు. చికోటి క్యాసినో నెట్‌వర్క్‌లో 18 మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు 280 మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చికోటికి చెందిన 4బ్యాంకు అకౌంట్లను ఈడీ అధికారులు గుర్తించారు.
చెన్నై, బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారులకు హవాలా ఏజెంట్‌గా ప్రవీణ్ వ్యవహరిస్తున్నారని ఈడీ అధికారుల విచారణలో తేలింది. గోవా, ఇండోనేషియా, నేపాల్ బోర్డర్స్‌లోని క్యాసినోలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. అయితే గోవా, నేపాల్‌లో లీగల్‌గానే క్యాషినో బిజినెస్ చేస్తున్నట్లు ఈడీ అధారాలు సేకరించింది.
బిగ్ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర వేశాడు చికోటి ప్రవీణ్. తారలతో తయారు చేసిన ప్రోమోలను ప్రముఖులకు చేరవేశాడు. మొత్తం 13 మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రమోషన్ వీడియోలు చేసినట్లు గుర్తించింది ఈడీ. జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించిన క్యాసినోలో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు ఈడీ అధికారులు.
ఇప్పటికే ప్రవీణ్ కుమార్, మాధవరెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేసింది. ఫోన్, ల్యాప్ టాప్, పాస్ పోర్టు స్వాధీనం చేసుకుంది. సోమవారం విచారణకు హాజరు కావాలని ప్రవీణ్‌కు నోటీసులు ఇచ్చింది ఈడీ.
మరోవైపు క్యాసినో నిర్వాహకులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులతో ఉన్న లింక్స్ కూడా బయటపడ్డాయి. ఈ జాబితాలో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, వైజాగ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. చికోటి ప్రవీణ్ - మాధవరెడ్డి వ్యవహారంలో ముగ్గురు హవాలా ఆపరేటర్లను గుర్తించింది. సైదాబాద్ ఐఎస్‌సదన్, బోయిన్‌పల్లి, సిటీ శివారులోని కడ్తాల్.. ఇలా 8 ప్రాంతాల్లో దాదాపు 20 గంటల పాటు సోదాలు జరిగాయి. హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ని కోట్లు చేతులు మారాయనే దానిపై విచారణ కొనసాగుతోంది. రూపి కన్వర్షన్ ఆపరేషన్‌లో ముగ్గురు హవాల ఏజెంట్లు ఉన్నారు చెన్నైకి చెందిన ఓ బంగారం వ్యాపారి హవాలా ఏజెంట్‌గా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com