Editorial : బీఆర్ఎస్ లో త్యాగయ్యలు...

Editorial : బీఆర్ఎస్ లో త్యాగయ్యలు...
కమ్యూనిస్టులతో పొత్తుతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ ; ఖమ్మం నల్గొండ జిల్లాల పైనే వామపక్షాల ఫోకస్....బీఆర్ఎస్ లో కమ్యూనిస్టుల పొత్తు ఆందోళన రేపుతుంది.. మునుగోడులో బీఆర్ఎస్ కు స్నేహహస్తం చాటిన వామపక్షాలు...

భవిష్యత్తులోనూ కలిసి నడుద్దామని చేసిన తీర్మానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులురేపుతోంది. త్యాగాలు చేయకతప్పదా అనే డైలమాలో పడ్డారు.


కమ్యూనిస్టులు 2014 లో 2018 లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 2014లో సీపీఎం భద్రాచలం నుంచి గెలుపొందింది. సీపీఐ దేవరకొండ నుంచి గెలుపొందింది. ఆ తర్వాత సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ టీఆర్ఎస్ లో చేరారు. ఇక 2018లో లెఫ్ట్ పార్టీల్లో ఒక్కరూ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.


ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న ఉభయ కమ్యూనిస్టు లు బీఆర్ఎస్ తో పొత్తు తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.. గతంలో నల్గొండ ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉన్న ఆ పార్టీలు ఇప్పుడు ప్రభావం చూపే స్దితిలో లేవు. మునుగోడు లో వామపక్షాలకు ఉన్న ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అని భావించిన కేసీఆర్ వారితో చర్చలు జరిపి.. మద్దతు ఇచ్చేలా సక్సెస్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారికి సీట్లు ఇవ్వాల్సిన పరిస్ధితి అనివార్యంగా కనిపిస్తోంది. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్ కు వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల అండ అవసరం ఉన్న నేపద్యంలో తెలంగాణలో కొందరూ ఎమ్మెల్యేలు త్యాగం చేయక తప్పని పరిస్దితి.



ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక సీటు కేపరిమితమయింది. ఆతర్వాత కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. 2014 లో వైసీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరినఎమ్మెల్యేలు 2018 లో ఓటమిచెందారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పువ్వాడ అజయ్ మాత్రమే గెలుపొందారు. ఇప్పుడు సైతం ఇతరపార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో మళ్లీ చేరారు.. కమ్యూనిస్టులతోపొత్తు ఖాయమవడంతో ..ఆ ఎఫెక్టు మొదట ఖమ్మం జిల్లా పైనే పడనుంది.


పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోచేరారు. పాలేరు లో ఓడిపోయిన తుమ్మలనాగేశ్వర్ రావు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. పాలేరునుంచి పోటి చేయాలని భావిస్తున్నారు.. మొన్నటివరకు అంటీముట్టనట్టు వ్యవహరించిన పార్టీ... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్దమవడంతో.. అలెర్ట్ అయిన కారుపార్టీ.,తుమ్మలతో చర్చలు జరిపి డ్యామేజ్ కాకుండా చూసుకుంది.. అయితే ఇదే పాలేరు సీటుపై సీపీఎం పార్టీ దృష్టి పెట్టింది.


సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇక్కడి నుంచే పోటి చేయాలని భావిస్తున్నారు. పొత్తులో పాలేరు సీటు తోపాటు మధిర, భద్రాచలం లో పోటి కి సై అంటున్నారు,. మధిర భద్రాచలం లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇబ్బంది లేదు.. అయితే సీపీఐ పార్టీ కార్యదర్శికూనమనేని సాంబశివరావు సైతం ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు.



గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇల్లందు, వైరా స్థానాల్లో పోటి చేయాలని భావిస్తున్నారు. ఇల్లందు లో హరిప్రియనాయక్ కాంగ్రెస్ నుంచి గెలిచింది అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2014లో కోరం కనుకయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత ఓటమి చెందారు. ఇక్కడ ఇద్దరి మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇల్లందు సీపీఐకి ఇవ్వాలని డిసైడ్ అయితే .. హరిప్రియనాయక్ , కోరంకనుకయ్యలు త్యాగాలు చేయకతప్పనిపరిస్థితి.


వైరాలో రాముల్ నాయక్ ఇండిపెండెంట్ గా గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. వైరా సైతం గతంలో ప్రాతినిథ్యం వహించిన సీపీఐ సీటు ..సో వైరా సైతం సీపీఐ కి ఇస్తే రాముల్ నాయక్ త్యాగం చేయాల్సిందే.. ఖమ్మం జిల్లాలో పాలేరు , భద్రాచలం, వైరా , ఇల్లందు, కొత్తగూడేం మధిర స్థానాలు ఉభయ కమ్యూనిస్టులకు కేటాయించకతప్పని స్ధితి ఉంది.. ఈ ఆరు సీట్లలో ఉన్న నలుగురు ప్రస్తుతఎమ్మెల్యేలు త్యాగాలు చేయాల్సిందేనంటున్నారు.



ఒకవేళ ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే..కొత్తగూడేంలో టీఆర్ఎస్ పోటి చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక నల్గొండ జిల్లాలో గతంలో నకిరేకల్ ,మునుగోడు , మిర్యాలగూడ,నల్గొండలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించేవారు. క్రమక్రమంగా కనుమరుగుయ్యారు.. మిర్యాలగూడ సీటు సీపీఎం పార్టీ అడిగే అవకాశం ఉంది, ఇక్కడ భాస్కర్ రావు త్యాగం చేయక తప్పనిపరిస్థితి..


ఇక సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నుంచి గతంలో మాజీ కార్యదర్శి చాడవెంకటరెడ్డి ప్రాతినిద్యంవహించారు.ఈసారి వయోభారంతో పోటి చేయలేనిస్దితి అయినప్పటికి తమకు బలమున్న చోట పోటి చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇక్కడ సతీశ్ బాబు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..మూడోసారి పోటికి సైఅంటున్నారు.. హుస్నాబాద్ సీపీఐకి కేటాయిస్తే .. సతీశ్ బాబు త్యాగంచేయాల్సిందే.. మొత్తానికి ఏడు నుంచి పదిసీట్లు వామపక్షాలు కోరే పరిస్దితి ఉంది..దీంతో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది.. సో చూడాలి కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ...



మార్గం శ్రీనివాస్

Tags

Read MoreRead Less
Next Story