Editorial: బలమైన లీడర్ల వేటలో పార్టీలు...!

Editorial: బలమైన లీడర్ల వేటలో పార్టీలు...!
ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు; 2019 కాంగ్రెస్ , బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం లకు చెరో సీటు; అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ ను ఆదరించిన ఓటర్లు


ఉమ్మడి హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల పరిధిలో నాలుగు పార్లమెంట్, 28 అసెంబ్లీ సీట్లలో ప్రజలు విభిన్న మైన తీర్పులు ఇస్తుంటారు. 2014 లో అసెంబ్లీలో టీడీపీ బీజేపీ కూటమికి జైకొట్టారు. 2018వచ్చే సరికి టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం రెండు సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీనే టీఆర్ఎస్ ను ఎదుర్కొంది.


ఎన్నికల ఏడాది కావడంతో .. అన్ని పార్టీలు బలంపెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ సైతం రేసులో ఉన్నామని సంకేతాలిస్తోంది. ఎంఐఎం పార్టీ ఆ ఏడు స్థానాల్లో గెలుస్తూనే వస్తోంది. ఇక మిగిలిన 21 స్థానాల్లో 2014 లో ఎంఐఎం రాజేంద్రనగర్, జూబ్లీహీల్స్ లో ఎంఐఎం పోటి చేస్తూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు నిలిచిన ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి.. బీజేపీ , కాంగ్రెస్ , ఎంఐఎం, టీఆర్ఎస్ నాలుగుపార్టీలకు ప్రాతినిధ్యం కల్పించారు.


మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఎంఐఎం, చేవేళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ లో మాత్రమే బీజేపీ గెలిచింది..రాష్ట్రంలో బీజేపీ గెలిచింది గోషామహల్ మాత్రమే.. మహేశ్వరం, ఎల్బీనగర్ లో కాంగ్రెస్ గెలిచినప్పటికి.., ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మహేశ్వరంలో గెలిచిన సబితా మంత్రి అయ్యారు. సుధీర్ రెడ్డి మూసి రివర్ డెవలప్ మెంట్ అధారటీ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు 20 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ , ఒక్క స్థానంలో బీజేపీ, పాతబస్తీ ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలున్నారు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సై అంటున్న పార్టీలు గట్టి అభ్యర్దుల వేటలో పడ్డాయి.


సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్ , జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో నాంపల్లి మినహా మిగితా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ముషీరాబాద్ లో బీజేపీకి గట్టి పట్టుంది. గతంలో ఆపార్టీ ఎంపీ లక్ష్మణ్ పోటిచేసి గెలుపొందారు. అంబర్ పేటలో సైతం కిషన్ రెడ్డి కొద్ది తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఎంపీగా పోటి చేసి గెలిచి కేంద్రమంత్రయ్యారు. ఈ సారి ఇద్దరు ఎంపీలు ముషీరాబాద్ , అంబర్ పేట నుంచి మరోసారి పోటికి సిద్దమవుతున్నారు.


ఖైరతాబాద్ లో సైతం బీజేపీ చింతలరామచంద్రారెడ్డి 2014లో గెలిచి 2018లో ఓడిపోయారు. మిగితా నియోజకవర్గాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటి ఇచ్చింది.. నాంపల్లి మినహా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ఓటుబ్యాంక్ బలంగానే ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే .. ఏడు నియోజకవర్గాల్లో 2014 ,2018 ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితమయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పెద్దగా ప్రభావం చూపలేదు.. కాస్తో కూస్తో పట్టున్న నేతలుసైతం అటు బీఆర్ఎస్ ..ఇటు బీజీపీలో జాయిన్ అయిపోయారు..


ఖైరతాబాద్ లో పీజేఆర్ కూతురు కాంగ్రెస్ లో చేరింది అదొక్కటే ఊరట.. విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో .. గత ఎన్నికల్లో పోటి చేసిన దాసోజ్ శ్రవణ్ బీఆర్ఎస్ లోచేరారు.. సనత్ నగర్ లో కీలక కాంగ్రెస్ నేత మర్రిశశిదర్ రెడ్డి బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ కు సైతం 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ మినహా ఎక్కడా గెలువలేదు.. టీడీపీలో గెలిచిన తలసాని, మాగంటి గోపినాద్, టీఆర్ఎస్ లోచేరారు. తలసాని మంత్రి అయ్యారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటి చేసి గెలపొందారు.. సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు బీజేపీ నుంచి గతంలో దత్తాత్రేయ ప్రస్తుతం కిషన్ రెడ్డి కి జై కొట్టారు.. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్, బీజేపీలమద్య పోటి నెలకొంది.. కాంగ్రెస్ పరిస్తితి ఖైరతాబాద్ , జూబ్లిహిల్స్ మాత్రమే పీజేఆర్ వారసులు ఉన్నారు.. వారిలో విష్ణు గత రెండు ఎన్నికల్లో ఓడటంతో .. నిరాశలో ఉన్న పరిస్దితి ఉంది..

ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాలు న్నాయి.. 2018లో ఏడు నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ మినహా..ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది.


ఎల్బీనగర్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి సైతం ఆతర్వాత టీఆర్ఎస్ లోచేరారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ప్రస్తుత పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి అసెంబ్లీకి పోటిచేసి ఓడిపోయనప్పటికి.. పార్లమెంట్ కుపోటి చేసి గెలుపొందారు. మేడ్చల్ లో సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి మినహా మిగితా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇంచార్జీలు లేకుండా పోయారు.. చాలామంది నేతలు ఇటు బీఆర్ఎస్ ..అటు బీజేపీలో చేరిపోయారు.. బీజేపీ విషయానికి వస్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటులో గెలవకపోయినప్పటికి..జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి .ఎల్బీనగర్ ,కూకట్ పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటినిచ్చింది. ఇరు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలకు గట్టి పోటి నిచ్చే అభ్యర్దులకోసం వెతుక్కోవాల్సినపరిస్థితి..

ఇక చేవేళ్ల నియోజకవర్గపరిదిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవేళ్ల, పరిగి, వికారాబాద్,తాండూర్ నియోజకవర్గాలున్నాయి.

మహేశ్వరంలో 2014 లో టీడీపీ 2018 లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 2014లో టీడీపీ నుంచి గెలిచిన తీగల కృష్ణారెడ్డి, 2018లోకాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు.. 2018 లో తీగల పై సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహేశ్వరం పరిధిలో బీజేపీ సత్తా చాటింది.. కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లోచేరడంతో వీక్ అయిందనే చెప్పాలి. ఇక రాజేంద్రనగర్ లో సేమ్ సీన్.. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ప్రకాశ్ గౌడ్ అనంతరం టీఆర్ఎస్ లో చేరారు.


2018లో టీఆర్ఎస్ నుంచిగెలుపొందారు. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు సరైన అభ్యర్దులు లేరనే చెప్పాలి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ.. టీడీపీ నుంచి గెలిచిన అరికేపూడి గాంథీ టీఆర్ఎస్ లో చేరి ..2018 లో గెలుపొందారు.. కాంగ్రెస్ లో ముఖ్యనేతగా ఎదిగి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన బిక్షపతియాదవ్ బీజేపీ లో చేరడంతో.. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. కాంగ్రెస్ కు సరైన అభ్యర్ది లేరనే చెప్పాలి. ఇక చేవేళ్లలో 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కాలేయాదయ్య అనంతరం టీఆర్ఎస్ లోచేరి..2018 లో తిరిగి టీఆర్ఎస్ టికెట్ పై గెలుపొందారు..


టీఆర్ఎస్ నుంచి పోటి చేసి ఓడిన రత్నం 2018 లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటిచేసి ఓడిపోయారు. బీజేపీ పార్టీ పెద్దగా లేదనే చెప్పవచ్చు. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దగా ప్రభావంచూపలేదు. పరిగి లో 2014లో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి గెలుపొందగా.. 2018లో మహేశ్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ పెద్దగా ప్రభావం లేదు.. ఈసారి కాంగ్రెస్ , బీఆర్ఎస్ మద్యే పోటి ఉండవచ్చు..


వికారాబాద్ నియోజకవర్గంలో 2014,2018 లో రెండు సార్లు టీఆర్ఎస్ గెలుపొందింది..అయితే 2014 లో సంజీవరావు పోటి చేస్తే..2018లో మెతుకుఆనంద్ పోటి చేసి గెలుపొందారు. రెండు సార్లు మాజీ మంత్రి ప్రసాద్ కాంగ్రెస్ నుంచి పోటి చేసి రెండోస్తానంతోసరిపెట్టుకున్నారు. గట్టి పోటి ఇచ్చినప్పటికి స్వల్పమెజార్టీతో ఓటమిచెందారు. బీజీపీ ఇతర పార్టీల వైపు చూడాల్సినపరిస్ధితి .. తాండూరులో 2014 లో పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు .. 2018 లో కాంగ్రెస్ చేతిలో ఓటమి చెందారు.


అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. ఇద్దరి మద్య బీఆర్ఎస్ లో అసమ్మతి పోరు నడుస్తోంది. కాంగ్రెస్ క్యాడర్ బలంగానే ఉన్న.. గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో .. వీక్ అయిందనే చెప్పాలి.. చేవేళ్ల నుంచి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటిచేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓడిపోయారు. ఎంపీగా టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి గెలుపొందారు.. విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోచేరడంతో .. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు.. బీజేపీ , కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల మద్య త్రిముఖ పోరు తప్పకపోవచ్చు.. ఇక హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గోషామహాల్ లో బీజేపీ గెలిచింది. మిగితా నియోజకవర్గాల్లో ఎంఐఎం హావా కొనసాగిస్తూనే ఉంది.. పార్లమెంట్ పరిధిలో సైతం ఎంఐఎం హావా కు అడ్డుకట్ట వేయడం అంతా ఈజీ కాదనే చెప్పవచ్చు..

ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో సత్తా చాటింది. బీజేపీతోపొత్తు కలిసివచ్చింది. బీజేపీ ఐదు స్థానాలు,టీడీపీ పదిహేనుసీట్లు గెలుపొందింది.మల్కాజ్ గిరి పార్లమెంట్ సీటు సైతం గెలుపొందింది. అయితే టీడీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం అయింది. జంటనగరాల ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు దీంతో టీడీపీ ఖాళీ అయింది. తాజాగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత .. తెలంగాణలో పార్టీని పునరుద్దరించే చర్యలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షునిగా నియమించారు. ఖమ్మంలో భారి సభను నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో పూర్వ వైభవం సాధించెందుకు వ్యూహాలు రచిస్తోంది. పట్టున్న నియోజకవర్గాల పై దృష్టి సారించింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పూర్వ నేతలందరిని తిరిగి టీడీపీ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారపార్టీ బీఆర్ఎస్ ను వీడుతారా లేదా అనేది ఇప్పడు చెప్పలేని పరిస్ధితి..


మార్గం శ్రీనివాస్

Tags

Read MoreRead Less
Next Story