Editorial: కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్

Editorial: కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్
ఇద్దరి టార్గెట్ "ఒక్కటే" ఆసక్తికరంగా నల్లగొండ రాజకీయం; అసెంబ్లీ వైపు ఆశగా చూస్తున్న ఎంపీలు; ఎన్నికల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు; పాత తరం నేతల్ని దగ్గర తీస్తున్న ఉత్తమ్; పార్టీ ఏదైనా ఎమ్మెల్యే బరిలోనే కోమటిరెడ్డితెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను అధికార BRSతో పాటు... ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలంటే అంత వీజీ కాదని.. అధికారపార్టీ అగ్ర నాయకత్వానికి తెలుసు. కాబట్టే.. అభ్యర్థుల ఎంపిక విషయంలో.. ఈసారి ఆచితూచి అడుగులు వేయాలని చూస్తున్నారట. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటికే చాపకింద నీరులా కసరత్తు ప్రారంభించాయట. ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల్లో.. క్యాండిడేట్లు ఎవరనే అంశంపైన సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్చ జరుగుతోందట. ఇటీవల జరిగిన మునుగోడు ఉప‌ఎన్నిక..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్పిన గుణపాఠంతో.. అధికార పార్టీ కాస్త ముందుగానే అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిందని చెప్పాలి. నిఘా విభాగంతోపాటు.. ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయిస్తూ.. ఎమ్మెల్యేలకు లోటుపాట్లపై దీశానిర్దేశం చేస్తోంద గులాబీ అధిష్టానం. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎన్నికల వరకు పర్ఫార్మెన్స్ లో వెనుకబడిన.. రెండు, మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు అప్పటి అవసరాన్ని బట్టి ఉండొచ్చనీ.. మిగతా సెగ్మెంట్లలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన క్యాండిడేట్లను బరిలో దింపాలని కాంగ్రెస్, బీజేపీలు చూస్తున్నాయట. ఇందులో భాగంగానే గట్టి అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టాయట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన సీనియర్ నాయకులుగా, మాజీ మంత్రులుగా పనిచేసి.. ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తిరిగి అసెంబ్లీవైపే సీరియస్ గా ఫోకస్ పెట్టారు. నల్లగొండ ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తిరిగి హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీ చేస్తానంటూ పలుమార్లు స్వయంగా ప్రకటించారు. నిజానికి.. 2018 అసెంబ్లీ ఎన్నికలతో కలిపితే.. ఈయన ఏకంగా ఐదు పర్యాయాలు వరుసగా శాసనసభ్యుడుగా గెలుపొందారు. ఎంపీగా ఉన్నప్పటికీ.. సొంత అసెంబ్లీ సెగ్మెంట్ "హుజూర్ నగర్" లోనూ. సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహించిన "కోదాడ" సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టిపెట్టారనే చెప్పాలి. దశాబ్దకాలంగా.. తనకు దూరమైన క్యాడర్ ని తిరిగి దగ్గర తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే.. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట.

నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ MLA గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి కంచర్ల భుపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలిచారు. అప్పటినుంచి కోమటిరెడ్డి భువనగిరి పార్లమెంట్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారని చెప్పొచ్చు. మూడున్నారేళ్లపాటు.. నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ వైపు చూడకపోవడంతో.. ఈ ప్రాంతంలోని పార్టీ శ్రేణులు ఢీలా పడ్డాయనే చెప్పాలి. అయితే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా కొనసాగుతున్న దుబ్బాక నర్సింహ్మారెడ్డి నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ మీద దృష్టి పెట్టడంతో.. ఎంపీ కోమటిరెడ్డి అలర్ట్ అయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పార్టీలన్నీ సీరియస్ గా తీసుకున్న క్రమంలో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీచేస్తానంటూ క్యాడర్ తోనూ.. మీడియా ముందు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఏ పార్టీ నుంచి అనే విషయం మాత్రం.. అప్పటి పరిస్థితులను బట్టి అంటూ ఆయన మరో బాంబ్ పేల్చడం గమనార్హం. తమ్ముడు లాగా బీజేపీ లోకి వెల్తారా..? లేదంటే హస్తం పార్టీలోనే కొనసాగుతారా..? అనే విషయం తెలియక క్యాడర్ జుట్టు పీక్కుంటోంట. మొత్తానికి కోమటిరెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా పోటీచేయడం పక్కా అంటున్నారు ఫాలోవర్లు.

ఈరకంగా.. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని.. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎంపీ లుగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు తిరిగి అసెంబ్లీ వైపు చూస్తున్నారనే చెప్పాలి.

Tags

Next Story