Editorial: బీఆర్ఎస్ పై నిప్పులు కక్కుతున్న కాంగ్రెస్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Editorial: బీఆర్ఎస్ పై నిప్పులు కక్కుతున్న కాంగ్రెస్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
అసెంబ్లీలో చర్చలకే పరిమితమయిన ఆ పార్టీల ఎమ్మెల్యేలు; బీజేపీ టార్గెట్ గా సభను నడిపడంతో బీఆర్ఎస్ తోపాటు కేంద్రం పై విమర్శలకే పరిమితమయిన సీఎల్పీ నేత భట్టి; మోడీ ని విమర్శిస్తున్నా..అడ్డు చెప్పని బీజేపీ ఎమ్మెల్యేలుచ; పదే పదే ఈటెల ప్రస్తావనతేవడంతో అవాక్కయిన నేతలు; తనను బద్ నాం చేసేందుకు మైండ్ గేమ్ ఆడారన్న ఈటెల...


అసెంబ్లీసమావేశాలు జరిగిన తీరు కొత్త చర్చకు తెరలేపాయి.. అటు కాంగ్రెస్ ,.ఇటు బీజేపీలోనూ ఆపార్టీ ఎమ్మెల్యేల పై బీఆర్ఎస్ కురిపించిన ప్రేమ పలు అనుమానాలకు దారీ తీసింది. బయట కేసీఆర్ పై ఒంటి కాలు పై లేస్తున్న రేవంత్ , బండి సంజయ్ లు సభలో జరిగిన పరిణామాలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయంటున్నారు. ఎన్నికల ఏడాది బడ్జెట్ సమావేశాలు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాల్సిందిపోయి.. చర్చ మొత్తం మోడీ,కేంద్రప్రభుత్వం వైపు తీసుకెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పై ప్రతిపక్ష పార్టీల విమర్శలకు తావులేకుండా పోయిందన్న టాక్ నడుస్తోంది. పార్టీ మారిన ఈటెల రాజేందర్ సమక్షంలోనే ... ఆయన్నే సాక్షిగా చూపేడుతూ కేంద్రం, మోడీపై విమర్శలు చేయడంలో.. అటు సీఎం ,మంత్రులు కేటీఆర్, హరీష్ సక్సెస్ అయ్యారు. తన పేరును పదేపదే ప్రస్తావించడంతో ఈటేల డిఫెన్స్ లో పడిపోయారన్నది వాస్తవం. ఇదే ఇప్పడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే హుజూరాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచినప్పటినుంచి ఇంతరవరకు ఈటెలకు సభలో మాట్లాడే అవకాశం రాలేదు.. గత రెండు సమావేశాల్లోనూ ఈటెలను సస్పెండ్ చేశారు. దీంతో ఈ సమావేశాల్లోనూ ఈటెల పై కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారు. సభలోకి బీజేపీ ఎమ్మెల్యేలు వస్తే.. సస్పెండ్ చేస్తారన్న అనుమానం కలిగింది. . అయితే అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు సెషన్ మొత్తం సభలో కొనసాగారు. మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ సైతం ఈటెల రాజేందర్ గతంలో బీజేపీ పై మాట్లాడిన మాటలను వీడీయో రూపంలో ప్రజెంటేషన్ చేసి మరీ..ఈటెల రాజేందర్ అన్న అంటూ ప్రేమ కురిపించారు. మరోవైపు గత కొంత కాలంగా బీజేపీలో ఆధిపత్యపోరు నడుస్తోంది. రాజేందర్ ను చేరికల కమిటి చైర్మన్ గా నియమించారు. రాజగోపాల్ రెడ్డి , కొండా విశ్వేశ్వర్ రెడ్డి మినహా పెద్ద నేతలు ఎవరూ కమలం పార్టీలో జాయిన్ కాలేకపోయారు. పార్టీతో సంబందంలేకుండా స్వతంత్ర హోదాలోనే పలు కార్యక్రమాలకు ఈటెల వ్యవహరిస్తున్నారు. పార్టీలో కోవర్టులున్నారంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు పెద్దదూమారాన్నే రేపాయి.. కోవర్టులు ఎవరో ఈటెలే చెప్పాలంటూ విజయశాంతి లాంటి నేతలు బహాటంగానే సవాల్ చేశారు,. మరో మాజీ ఎంపీ తో విబేదాలు రావడంతో .. ఈటేల ఏకాకి అయ్యారని అంటున్నారు. అటు కాంగ్రెస్ ఛీఫ్ రేవంత్ సైతం ఈటేల రాజేందర్ కాంగ్రెస్ లో చేరాలని ఓపేన్ ఆఫర్ ఇచ్చారు. తన స్వభావానికి బీజేపీ సరిపోదని..కాంగ్రెస్సే అయనకు సరైన పార్టీ అని రేవంత్ అంతర్గతంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పడు ..అసలు ఈటేల మోహం చూడటానికే ఇష్టపడని కేసీఆర్..ఎకంగా పదిసార్లు ఈటేల పేరెత్తడం.. ఆయన అనుభవం,సలహాలు తీసుకోవాలని హరీష్ రావుకు సూచించడం ఒక ఎత్తు అయితే... ఈటేల సమక్షంలో మోడీని రెండుగంటలపాటు విమర్శలు చేయడంతో .. డిఫేన్స్ లో పడిపోవడం ఈటేల వంతయింది. కనీసం అటు ఈటేల కానీ..ఇటు రఘునందన్ రావు ఇద్దరు అఢ్డుతగలకపోగా.. సైలెంట్ గా వింటూ పోయారు.. అయితే కేసీఆర్ మైండ్ గేమ్ ఆడారని.. తనను బద్ నాం చేయడానికే కేసీఆర్ వ్యూహత్మకంగా తన పేరు ప్రస్తావించారని ఈటెల చెప్పినప్పటికీ.. ఏదో జరుగుతుందన్న చర్చ సాగుతోంది. పార్టీనుంచి గెంటేసిన తర్వాత బీఆర్ఎస్ లో చేరేది లేదని ఈటేల స్పష్టం చేసినా.. ఈటెల రాజేందర్ పై కేసీఆర్ కేటీఆర్ హరీష్ చూపిన కన్సర్న్ .. బీజేపీలో ఈటేల పై అనుమానాలకు దారి తీసీందన్న చర్చ సాగుతోంది.. పార్టీ ఛీఫ్ బండి సంజయ్ బయట కేసీఆర్ కుటుంబంపై ఎన్ని సవాల్లు విసిరినా.. సభలో ఆ పార్టీ వ్యవహరించినతీరు బీఆర్ఎస్ కే ప్లస్ గా మారిందనడంలో సందేహం లేదు.

ఇక కాంగ్రెస్ లో నూ అదే సన్నివేషన్ కనిపిస్తోంది... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో బీఆర్ఎస్ పాలన పై నిప్పులు చెరుగుతున్నారు. జనవరి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమంటూ జోస్యం సైతం చెపుతున్నారు. అయితే అసెంబ్లీలో కేసీఆర్, మంత్రులు మోడీని, కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో .. వారితో కాంగ్రెస్ సైతం కేంద్రాన్ని విమర్శించెందుకే పోటి పడ్డారు. సీనియర్ ఎమ్మెల్యేలు గా శ్రీధర్ బాబు, భట్టీ ,జగ్గారెడ్డి ముగ్గురూ చాలకాలంగా రాష్ట్ర ప్రభుత్వం తో సఖ్యతగానే ఉంటున్నారు. రేవంత్ పీసీసీ ఛీఫ్ అయ్యాక.. రేవంత్ కు సీనియర్ల మద్యగ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ పూడ్చేందుకు ఏకంగా రాష్ట్రఇంచార్జిని మార్చి..కొత్త ఇంచార్జీని నియమించి..సీనియర్లు రేవంత్ మద్య సఖ్యత కుదుర్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ కు అసెంబ్లీలో ఎన్నికల ఏడాది రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం, నిరుద్యోగభృతి, ఇరిగేషన్ ప్రాజెక్టులు,,చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చాన్స్ ఉన్నా...ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదనే విమర్శలు వస్తున్నాయి.. బీఆర్ఎస్ సీఎం,మంత్రులు సైతం కేంద్రాన్ని విమర్శించడంతో..అనివార్యంగా కాంగ్రెస్ సైతం బీజేపీ పైనే విమర్శలు చేయడానికి ప్రాదాన్యత ఇచ్చింది. బడ్జెట్ , ద్రవ్యవినిమయబిల్లుల పై చర్చ సందర్బంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేదనే ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి.. రేవంత్ పాదయాత్రలో తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. అసెంబ్లీ లో సీన్ వేరుగా ఉందన్న మాట వాస్తవం.. మొత్తానికి రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీలో ఉన్న అనైక్యత, బీఆర్ఎస్ కు లాభిస్తోందంటున్నారు. రేవంత్ రెడ్డితో సీనియర్ల కు ఉన్న గ్యాప్ , బండి తో ఈటేల కు ఉన్న గ్యాప్ ను బీఆర్ఎస్ చక్కగా వాడుకుందనే చెప్పాలి.

- మార్గం శ్రీనివాస్.

Tags

Read MoreRead Less
Next Story