Editorial: "వస్తాడు, సెటిల్ చేస్తాడు, వెళ్తాడు... రిపీట్...!"

తెలంగాణలో ఎన్నికలకు ఏడాది కూడా లేదు. ఈ నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో టిక్కెట్ ఫైట్ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు, ఎమ్మెల్సీగా అడ్జస్ట్ అవుతున్నవాళ్లు, వేరే పార్టీ నుంచి కారెక్కిన వాళ్లు... ఇలా చాలామంది ఆశావహులు గులాబీ టిక్కెట్ పై గంపెడాశలు పెట్టుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నువ్వా నేనా అన్నట్లుగా వార్ నడుస్తోంది. అధినేత కేసీఆర్ సిట్టింగులకే టిక్కెట్ అని హామీ ఇచ్చినా... ఆశావహుల పోరు ఆగట్లేదు. ఇంతటి అసమ్మతి నడుమ వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం అమలు చేయబోతోంది అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు పొలిటికల్ సర్కిల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
భూపాలపల్లిలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి... కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి కారెక్కిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తోంది. రోజురోజుకు టిక్కెట్ ఫైట్ తీవ్రమవుతోంది. ప్రగతి భవన్ వరకు పంచాయితీ చేరింది. అయినా ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా కేటీఆర్ భూపాలపల్లి పర్యటనలోనూ బీఆర్‌ఎస్ వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మంత్రి సమక్షంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గీయులు పరస్పర నినాదాలతో హోరెత్తించారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సిరికొండ వర్సెస్ గండ్రగా విడిపోయాయి. సభలో ఇరువర్గాల నినాదాల మధ్యనే ప్రసంగించిన కేటీఆర్.. చివరకు అసహనానికి గురయ్యారు.
ఇక తనదైన స్టయిల్ లో చాలా తెలివిగా టిక్కెట్ పంచాయితీని తెగ్గొట్టారు కేటీఆర్. మధుసూదనాచారి అంటే కేసీఆర్‌కు ఎంతో అభిమానం.. మీరు ఓడగొట్టినా పిలిచిమరీ ఎమ్మెల్సీని చేశారంటూ ఆయన వర్గీయులకు చెక్ పెట్టారు. మధుసూదనాచారి మండలిలో ఇంకో ఐదేళ్లు కొనసాగుతారు.. గండ్ర ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేది గండ్రానే అని క్లియర్ కట్ మెస్సేజ్ ఇచ్చేశారు కేటీఆర్.
బైట్- కేటీఆర్
ఇక హుజూరాబాద్ లోనూ సేమ్ పంచాయితీ. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌషిక్ రెడ్డికి, బీఆర్ఎస్ లో ఉన్న గెల్లు శ్రీనివాస్ కి టిక్కెట్ ఫైట్ నడుస్తోంది. ఉపఎన్నికకు ముందు పార్టీలోకి వచ్చిన కౌషిక్ రెడ్డికి అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకే హుజూరాబాద్ సీటని గెల్లు శ్రీనివాస్ భావించాడు. దీంతో కౌషిక్, గెల్లు మధ్య వార్ నడుస్తూ వస్తోంది. అధిష్టానం వద్ద పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
అయితే ఆ మధ్య జమ్మికుంటలో సభ నిర్వహించిన మంత్రి కేటీఆర్... పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ ల టిక్కెట్ ఫైట్ కు తనదైన స్టయిల్ లో ఫుల్ స్టాప్ పెట్టారు. కౌషిక్ రెడ్డిని పదేపదే హైలెట్ చేస్తూ... వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయబోతున్నాడనే పరోక్ష సంకేతాలిచ్చారు. ప్రజలు అండగా ఉండాలని నొక్కి మరీ చెప్పారు. సో ఇలా కౌశిక్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కేటీఆర్.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తున్న కేటీఆర్... చాకచక్యంగా ఒక్కో పంచాయితీని పరిష్కరిస్తూ వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్, కౌషిక్ రెడ్డిల టిక్కెట్ పంచాయితీకి ఫుల్ స్టాప్ పెట్టిన మంత్రి... తాజాగా భూపాలపల్లిలో మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణారెడ్డిల వార్ కు ముగింపు పలికారన్న టాక్ నడుస్తోంది. అయితే కేటీఆర్ పర్యటన అనగానే ఆశాహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఎవరి టిక్కెట్ ఎప్పుడు ఎగిరిపోతుందో అని గుబులు పడుతున్నారట. చూడాలి మరి మంత్రిగారు పరిష్కరించబోయే తర్వాతి పంచాయితీ ఎవరిదో, ఎక్కడిదో?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com