Editorial: పీకల్లోతు కష్టాల్లో మంత్రి కాకాని

Editorial: పీకల్లోతు కష్టాల్లో మంత్రి కాకాని
కాకానికి అచ్చిరాని మంత్రి పదవి ; వెంటాడుతున్న కేసులు, ఆరోపణలు; ఉచ్చులా బిగుస్తున్న సోమిరెడ్డి కేసులు; పీకల్లోతు కష్టాల్లో మంత్రి కాకాని.... ఎలా బయటపడాలో తెలియక బిక్కుబిక్కు

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండోసారి గెలిచిన రెండున్నరేళ్ల తరువాత మంత్రి పదవి చేజిక్కించుకుని అమాత్యులు అని పిలింపించుకోవాలన్న కోరికా తీరింది. జిల్లాల పునర్విభజన సదర్భంలో రాష్ట్రం మెత్తం ఒకెత్తైతే నెల్లూరు జిల్లా మాత్రం ప్రత్యేకం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఏడు నియోజకవర్గాలతో జిల్లాగా రూపొందాయి. కానీ నెల్లూరు జిల్లా మాత్రం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంటులోని సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటగిరిలోని సగం నియోజకవర్గంతో ఎనిమిదిన్నర నియోజకవర్గాల అతిపెద్ద జిల్లాగా ఏర్పడింది. ఇది కాకానికి మంత్రి అయ్యేందుకు బాగా కలిసొచ్చింది. అయితే మంత్రి అయ్యానని సంతోషించే లోపే వెంటాడుతున్న కేసులు, అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట కాకాని.

మెుదటి దఫా సర్వేపల్లి నియోజకర్గ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నప్పుడు... కాకని కల్తీ మద్యం పంచి పెట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆరోపణలు చేసిన మాజీమంత్రి సోమిరెడ్డిపై కాకాని కక్ష పెంచుకున్నాడు. సోమిరెడ్డి మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో వందల కోట్ల ఆస్తులు ఇతర దేశాల్లో కూడబెట్టాడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే పోలీసుల విచారణలో అవి నిరాధారమైనవి అని రుజువు అయ్యాయి. దీంతో అపుడు సోమిరెడ్డి రంగంలోకి దిగాడు. క్రిమినల్ డిఫర్మేషన్, సివిల్ డిఫర్మేషన్ ఫైల్ చేసి కాకానికి ఉచ్చు బిగించాడు. దీంతో ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నాడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.

సోమిరెడ్డి కాకానిపై పెట్టిన కేసులన్నీ ఒక్కొక్కటిగా విచారణ దశకు చేరుకుంటున్నాయి. వీటికితోడు మంత్రి పదివి చేపట్టిన రెండోరోజే నకిలీ పత్రాల కేసు కాకాని మెడకు చుట్టుకుంది. తాలుకా పత్రాలు కోర్టులో నుండి అపహరణ గురి కావడాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సీబీఐ విచారణకు ఆదేశించింది. కల్తీ మద్యం కేసు, సోమిరెడ్డి పెట్టిన కేసులు, అటు డాక్యుమెంట్ల చోరీలో సీబీఐ విచారణతో కాకాని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట.

ఇవి చాలదన్నట్లు ఈ మధ్య మంత్రి కాకానిపై అవినీతి ఆరోపణలు ఎక్కువైయ్యాయి. సర్వేపల్లి చెరువును తన అనుచరుల చేత తోడించి ఖజానా నింపుకుంటున్నాడని మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభగిరిపట్నం కొండ నుండి ఒక్క బండను కూడా ఎవరు కదిలించలేరని కొండెక్కి చెప్పిన కాకాని.. అధికారంలోకి వచ్చేసరికి ప్రభగిరిపట్నం కొండను మాయం చేయడంలో వంద కోట్ల అవినీతి జరిగిందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు కనుపూరు ప్రధాన కాలువ మరమ్మత్తుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇరిగేషన్, ఉపాధిహామీ పనుల్లో మంత్రి కాకాని 30 కోట్లు తినేశాడని ప్రతిపక్ష లీడర్లు జోరుగా చర్చించుకుంటున్నారు.

మెత్తానికి మంత్రి పదవే కాకానికి దరిద్రంలా దాపురించిందనే చర్చ జరుగుతోంది. ఏ ముహుర్తాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడో గానీ నాటి నుండి ఒకదాని తరువాత ఒకటి.... కేసుల రూపంలో, అవినీతి ఆరోపణల రూపంలో వెంటాడుతునే ఉన్నాయి. ఇపుడే ఇదే ఇష్యూ సర్వేపల్లి నియోజకవర్గంలో చర్చనీయంశంగా మారింది. మరి 2024 ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ కాకానిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story