Editorial : ఆ ఇద్దరిపైనే చర్చ...

Editorial :  ఆ ఇద్దరిపైనే చర్చ...
పొంగులేటి, కొమటిరెడ్డి పరిస్తితి పై రాజకీయవర్గాల్లో చర్చ; కమలంలో అనుకూల పరిస్తితులు లేవా...! అందుకే ఆపార్టీలో చేరలేకపోతున్నారా...! ఎన్నికల వరకు కొత్త వేదిక పెడతారా...! బీజేపీ నేత కలిసివస్తారా...!

ఒకరు మాజీ, మరొకరు తాజా ఎంపీలు. ప్రస్తుతం రాజకీయభవిష్యత్తుకోసం తంటాలుపడుతున్నారు. తాము ప్రస్తుతం ఉంటున్న పార్టీలో గత కొంతకాలంగా అసమ్మతి రాగాన్ని ఎత్తుకున్నారు. మాజీ ఎంపీ పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుత ఎంపీ మాత్రం త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఆ ఇద్దరు నేతల రాజకీయ అడుగులు వారిని నమ్ముకున్న క్యాడర్ లీడర్లు సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి.. ఆనేతలెవరోకాదు ఒకరు బీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్రం ఖమ్మం..మరోకరు కాంగ్రెస్ ఎంపీ కొమటిరెడ్డివెంకటరెడ్డి ఫ్రం భువనగిరి ..ఈ ఇద్దరు ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో కీలకపాత్రపోషించాలని ఊవ్విళ్లూరుతున్నారు.


అయితే ఏ పార్టీలో అనేది తేల్చుకోలేకపోతున్నారట. మాజీ ఎంపీ పొంగులేటి విషయానికివస్తే.. ఖమ్మం జిల్లాలో సడన్ గా తెరపైకి వచ్చారు. 2014 లో అనూహ్యంగా వైయస్సార్ సీపీ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. అనంతర పరిస్థితిల్లో టీఆర్ఎస్ లోచేరారు. 2018 లో ఎక్కడా పోటిచేయలేకపోయారు.అటు అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల, మదన్ లాల్, జలగం వెంకట్రావుల ఓటమి కి పరోక్షంగా పనిచేసినట్టు ఆరోపణలు రావడంతో .. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. ఖమ్మం ఎంపీగా నామానాగేశ్వర్ రావు ను పార్టీలోకి తీసుకొని..టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి రాజకీయం గత నాలుగున్నరేళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్నప్పటికి ప్రాధాన్యతలేకుండా పోయింది.


కేటీఆర్ అండ ఉన్నప్పటికి కేసీఆర్ ఆదరణ కరువు అవడంతో ..చివరకు పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారు. తన అనుచరులతో సమావేశం అయ్యారు. పార్టీ మారుతున్న సంకేతాలిచ్చారు. ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ లోచేరితే తన అనుచరులకు టికెట్లు వస్తే..గెలుపించుకోవచ్చు.పదినియోజకవర్గాల్లో సత్తా చాటవచ్చనేది అనుచరులఆలోచన..అయితే బీజేపీ నుంచి పార్టీలో చేరాలని ఒత్తిళ్లు రావడంతో.. అమిత్ షాతో బేటి కి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది. అయితే భేటి జరగలేదు. బీజేపీ నేతలెవరూ ఆయనను కలిసిందిలేదు.. కాంగ్రెస్ ఎల్పీనేత భట్టీ కాంగ్రెస్ లో చేరాలని కోరడంతో.. సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది..


బీజేపీలోకి వెళితే .. ఖమ్మం జిల్లాలో తాను ఆడిందిఆటా పాడింది పాటా.. పదినియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్ ఇప్పించుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి గెలుస్తారానే నమ్మకం ఇంకాలేదు.. అయితే కాంగ్రెస్ లోచేరితే మాత్రం గెలుపు అవకాశాలుంటాయని అనుచరులమాట. దీంతో పొంగులేటి ఎటూ తేల్చుకోలేకపోతున్నారట..అంతేకాదు బీజేపీలో ని మిత్రుడు కీలకనేత సైతం ఇప్పుడే వద్దు అని సలహా ఇచ్చారట. తన పరిస్తితే దారుణంగా ఉంది.. ఎన్నికలవరకు ఓపికపట్టు అప్పుడు చూద్దాం అనే సలహాసైతం ఇచ్చాడంటున్నారు. దీంతో ఆయన బీజేపీ వైపు అడుగులకు ప్రస్తుతానికి బ్రేక్ పడిందట.. మూడుపార్టీల్లో కీలకనేతలు ఒక ఐక్య కూటమిగా ఏర్పడి నాలుగైదు సీట్లు గెలిచినా.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్రపోషించవచ్చనే ఆలోచన సైతం చేస్తున్నారనిసమాచారం..

ఇక భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి ది మరి విచిత్ర పరిస్దితి..తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఏరి కోరి తెచ్చుకున్న ఉపఎన్నికలో ఓటమితో .. ఆయన పరిస్దితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. గెలిస్తే బీజేపీ లో చేరాలని డిసైడ్ అయ్యారనేది అనుచరుల ప్రచారం. మోడీ అమిత్ షాతో సైతం పార్లమెంట్ లో తరుచుగా సమావేశం సైతం అయ్యారు. హోంగార్డులతో తమను పోల్చుతారా అంటూ రేవంత్ రెడ్డి పై నిప్పులు కక్కారు.. తీరా బీజేపీ ఇంకా నల్గొండలో వీక్ గా ఉండటం తో కాంగ్రెస్ లో సర్దుబాటుకే మొగ్గుచూపారు.


కొత్త ఇంచార్జీతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తో మొదలయిన కలయిక...అడుగుపెట్టను అని సవాల్ చేసీ మరీ గాందీభవన్ మెట్లు ఎక్కాడు.. రేవంత్ తోనూ సమావేశమయి..కాంగ్రెస్ లో కలిసి పనిచేద్దామనే సంకేతాలిచ్చాడు.. నిజంగానే ఎన్నికలవరకు ఉంటాడా... మరల పార్టీ మారాతాడా లేడా అనేచి చూడాలి,అయితే ఈయనకు సైతం .. పొంగులేటికి సలహా ఇచ్చిన బీజేపీ నేత..ఇప్పుడే పార్టీ మారవద్దు .పరిస్ధితులు ఆశాజనకంగాలేవు..కాంగ్రెస్ లో పనిచేసుకో అవసరమైతే ఐక్య వేదిక ఏర్పాటు చేద్దామనే సలహా ఇచ్చారట.. అందుకే గాందీభవన్ మెట్లు ఎక్కిండని టాక్ .. సో చూడాలి.. ఇద్దరు రాబోయే రోజుల్లో ఎటువంటి అడుగులు వేస్తారో ...

మార్గం శ్రీనివాస్

Tags

Read MoreRead Less
Next Story