బడి గంట మోగింది.. ఫిబ్రవరి 1 నుంచి..

పిల్లలు బడికి వెళ్లక ఏడాది అవుతుంది.. అరుపులు, ఆటపాటలు అన్నీ బంద్ అయి ఆన్‌లైన్ క్లాసులంటూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకుని కూర్చునే వారికి ఈ వార్త ఊరటగానే ఉన్నా కొంత భయంగానే ఉంది. అసలే అంతంత మాత్రంగానే ఉన్న స్కూలు టాయ్‌లెట్లు గుర్తొస్తే తల్లిదండ్రుల గుండెల్లో దడ. తెలంగాణలో విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్నాయి.
నేడు (సోమవారం) మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 9,10,11,12 తరగతుల నిర్వహణకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. కరోనా కారణంగా గత విద్యాసంవత్సరంలో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు ప్రకటించారు.
ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండడంతో.. ఇతర రాష్ట్రాల తరహాలోనే విద్యాసంస్థలను తిరిగి తెరవడానికి తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లతో జరుగుతున్న ఈ భేటీలో విద్యా, రెవెన్యూ సంబంధిత అంశాలతో పాటు కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com