తెలంగాణలో రేపటినుంచి విద్యాసంస్థలు మూసివేత..!

తెలంగాణలో రేపటినుంచి విద్యాసంస్థలు మూసివేత..!
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు, మెడికల్ కాలేజీలు యథావిధిగా నడుస్తాయని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనతో స్కూళ్లు.. కాలేజీలు, యూనివర్సిటీలన్నీ మూతపడనున్నాయి.

అటు.. దేశంలో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతోందని.. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీలో అదే పరిస్థితి ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయని.. దీంతో కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయని చెప్పారు. తెలంగాణలోను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం దృష్ట్యా మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Tags

Next Story