EETALA: "పేదల ఉసురు తప్పక తలుగుతుంది"

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేదోళ్ల ఇళ్ల కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. "30, 60 గజాల్లో ఇళ్లు కట్టుకుంటోడు ఉన్నోడా, లేనోడా ముర్ఖుల్లారా.." అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈటల ఘాటుగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి కళ్లు కనబడటం లేదా అంటూ ఫైర్ అయ్యారు. బంజారా హిల్స్‌లో ఎకరా రూ.50 కోట్లు, రూ.60 కోట్లు, రూ.100 కోట్ల భూములను కాంగ్రెస్ నేతలు కబ్జా చేసి ఆక్రమించారని ఆరోపించారు. "వాటిని రిజిస్టర్ చేయడానికి జీవో నెం.58,59 తీసుకొచ్చారు కదరా.. నా కొడకా.." అంటూ ఆగ్రహంతో ఈటల ఊగిపోయారు. పేదోళ్ల బతుకుల్లో మట్టి కొడితే ఏమోస్తుందని నిలదీశారు. రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, వారి ఉసురు తప్పక తగులుతుందని పేర్కొన్నారు.
అడ్డుకున్న గాంధీ
మాదాపూర్‌లోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అడ్డుకున్నారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో కూల్చివేతలను ఆపేయాలని డిమాండ్ చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com